KCR : కేసీఆర్ మాత్రమే దేశాన్ని కాపాడతారట?

Only KCR will save the country?

Only KCR will save the country?

KCR : వినాశకాలే విపరీత బుద్ధి. తలనొప్పి తగ్గింది రోకలిని నా తలకు చుట్టు అన్నట్లు కేసీఆర్ ఆనాడు పలికిన ప్రగల్బాలు ఇప్పుడు వెంటాడుతున్నాయి. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు, కూట్లో రాయి ఏరలేనోడు ఏట్లో రాయి ఏరలేనట్లు దేశానికి తానే సారధ్యం వహిస్తానని అహంకార పూరితంగా వ్యవహరించి సొంత రాష్ట్రంలోనే అభాసుపాలయ్యారు. దీంతో కేసీఆర్ ను అందరు దూరం పెట్టారు. మహారాష్ట్ర, బిహార్, కర్ణాటక లాంటి రాష్ట్రాలు తిరిగి బీజేపీని ఎదుర్కొనే సత్తా తనకే ఉందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు.

పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లు అధికారం చేతిలో ఉన్నప్పుడు ఒదిగి ఉండాలనే విషయం తెలియక ఏదేదో మాట్లాడి ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోవడం గమనార్హం. యాదాద్రిలో తన బొమ్మ చెక్కించుకోవడం, గాంధీజీ, అంబేద్కర్ లాంటి మహామహుల పక్కన తన చిత్ర పటాలు ఉంచుకోవడం వంటి చర్యలు ఆయన పాతాళానికి పడిపోవడానికి పరోక్ష కారణంగా నిలిచింది.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను కాదని యావత్ దేశాన్ని ఏకతాటిపైకి నడిపిస్తానని నమ్మబలికారు. కానీ నోరు ఒకటి తలిస్తే నొసలు మరొకటి తలచిందన్నట్లు ఓటర్లు కేసీఆర్ కు కీలెరిగి వాతపెట్టారు. దీంతో ప్రతిపక్షానికి పరిమితమైపోయారు. విమానంలో దేశాటన చేసి తన నాయకత్వం గురించి ఏవో విషయాలు చెప్పుకుంటూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు మహారాష్ట్రలో బీఆర్ఎస్ దుకాణాలు మూసేశారు.

ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవాలనుకుంటున్న ఇండియా కూటమిలోనే లుకలుకలు మొదలయ్యాయి. త్రుణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు బయటకు వచ్చారు. దీంతో ఇండియా కూటమి నిలబడే అవకాశాలు కనిపించడం లేదు. ప్రాంతీయ పార్టీలతోనే ఆ సత్తా సాధిస్తామని కేసీఆర్ మళ్లీ పాత పాట అందుకున్నారు. దీంతో కేసీఆర్ మరోమారు ప్రాంతీయ పార్టీలతో జతకట్టి బీజేపీతో కయ్యానికి సై అంటున్నట్లు తెలుస్తోంది.

TAGS