Only 500 Tickets : స్టార్ హీరో బ్రాండ్ థియేటర్ల వద్దకు జనాన్ని తీసుకు వచ్చే కాలం పోయింది. ఇప్పుడు సినిమాకు సాధారణ ప్రేక్షకుడు రావాలంటే కంటెంట్ తప్పనిసరి. కంటెంట్ బాగుంటే స్టార్ హీరో అప్ కమింగ్ హీరో అనే తేడా చూపించడం లేదు నేటి సినీ ప్రియులు. దీనికి నిదర్శనమే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కొత్త సినిమా.. ఈ సినిమాకు సంబంధించి ఒక నెటిజన్ పోస్ట్ చేసిన షాకింగ్ నెంబర్లు బాలీవుడ్ ను సైతం ఆందోళనకు గురి చేస్తున్నాయి.
బాక్సాఫీస్ హిట్, డిజాస్టర్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేయడం అక్షయ్ కుమార్ కు కొత్తేమి కాదు. అందుకే ఆయన ఖాతాలో బ్లాక్ బస్టర్ లతో పాటు డిజాస్టర్లు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. అక్షయ్ హీరోగా ఇటీవల విడుదలైన ‘సర్ఫీరా’ 12వ తేదీ (శుక్రవారం)న థియేటర్లలోకి రానుంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు నేషనల్ మల్టీప్లెక్స్ లలో కేవలం 500 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రాకర్ ఒకరు ట్వీట్ చేశారు.
#Sarfira 500 tickets sold at National Chains so far. 2 Days to go.
— Nishit Shaw (@NishitShawHere) July 9, 2024
ఒక సూపర్ స్టార్ సినిమా విడుదలకు రెండు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో 500 టికెట్లు అమ్ముడుపోవడం బాలీవుడ్ ఎంత తిరోగమనంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు 100 కోట్ల సినిమాలతో తిరుగులేని స్టార్ గా వెలుగొందిన అక్షయ్ కుమార్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఏ మాత్రం కష్టపడడం లేదని తెలుస్తోంది.
బాలీవుడ్ ట్రాకర్ చేసిన ట్వీట్ పై స్పందించిన ఒక నెటిజన్ ‘రీమేక్ లు, రీమేక్ లు, మరిన్ని రీమేక్ లు!! రండి, @akshaykumar, మీరు దీని కంటే మెరుగ్గా ఉన్నారు! పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించడానికి ప్రామాణిక హాస్య శైలి ASAPకి తిరిగి రండి !”.
Remakes , remakes , more remakes !! Come on, @akshaykumar, you are better than this ! Get back to the authentic comedy genre ASAP to start the rebuild process !
— Subha (@SHIBDU1193) July 10, 2024
సూర్య కథానాయకుడిగా నటించిన తమిళ బ్లాక్ బస్టర్ ‘సూరరై పోట్రు’కు రీమేక్ గా ‘సర్ఫీరా’ తెరకెక్కింది.