Guntur Kaaram : సంక్రాంతి సెలవులు ముగిసాయి..ఇక నేటి నుండి సంక్రాంతికి విడుదలైన సినిమాల నిజమైన బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ తెలుస్తుంది. ‘హనుమాన్’ చిత్రానికి ఊహించినట్టుగానే భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. హైదరాబాద్ వంటి ప్రాంతాలలో అయితే సంక్రాంతి సెలవుల్లో ఎలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయో, అదే స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ నేడు కూడా ఉన్నాయి.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ కారణంగా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి. పండుగ సెలవలు మూడు రోజులు కూడా మంచి వసూళ్లను దక్కించుకుంది. కానీ నేటి నుండి మాత్రం ఈ సినిమాకి గడ్డు కాలం తప్పేలా లేదు. ఆంధ్ర ప్రదేశ్ ఉత్తరాంధ్ర మరియు కొన్ని ప్రాంతాలలో నేడు, రేపు కూడా సెలవులు ఉన్నాయి కాబట్టి డీసెంట్ స్థాయి వసూళ్లు రావొచ్చు.
కానీ నైజాం ప్రాంతం లో మాత్రం అతి దారుణంగా పడిపోయింది ఈ చిత్రం. నిన్న రాత్రి సమయానికి ఈ సినిమాకి హైదరాబాద్ లో ఉన్న 440 షోస్ లో ఒక్కటంటే ఒక్క షో కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ లోకి రాలేదు. ముఖ్యంగా ప్రసాద్ మల్టీప్లెక్స్ లాంటి పాపులర్ మల్టీప్లెక్స్ లో ఈ చిత్రానికి నేడు కేవలం 37 టిక్కెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. అందులో బ్లాక్ సీట్స్ తీసేస్తే 20 టికెట్స్ లోపే ఉంటాయి. మరోపక్క హనుమాన్ కి మాత్రం నేడు అన్ని షోస్ కి కలిపి 3770 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అంటే గుంటూరు కారం కంటే 99 శాతం ఎక్కువ అన్నమాట. చిన్న సినిమా పవర్ ముందు సూపర్ స్టార్ సినిమా ఇలా చతికలబడుతుంది అని ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు.
తొలి నాలుగు రోజులకు కలిపి 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , 5 వ రోజు 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ 80 కోట్ల రూపాయిల లోపే క్లోజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే నేటి నుండి ఈ చిత్రానికి నైజాం ప్రాంతం లో షేర్ వసూళ్లు రావడం కష్టమే. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా నేడు, రేపటితో దాదాపుగా రన్ పూర్తి అయ్యినట్టే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.