- 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.
టైమ్ స్లాట్ ఎస్ఎస్ డి దర్శనం కోసం 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండగా 5 గంటల సమయం పడుతోంది. గురువారం 60,545 మంది భక్తులు తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 32,527 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 2.53 కోట్లు వచ్చింది.
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కోసం ఎంతోమంది తపిస్తుంటారు. పిల్లల నుంచి పెద్దల వర్ శ్రీవారి దర్శనం కోసం బారులు తీరుతుంటారు. అయితే సమ్మర్ సీజన్ కావడం, పిల్లలకు సెలవులు ఉండడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.