
Madanapalle
Madanapalle : మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేస్తున్నారు. గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమయ్యాయి. ఈ ఘటనపై విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.
ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు జింకా చలపతి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. జింకా చలపతి ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అనుచరుడు బాబ్జాన్ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలో ఇంటికి తాళం వేసిన బాబ్జాన్ పోలీసులకు సహకరించలేదని సమాచారం.