Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.. 5 గేట్లు ఎత్తి నీటి విడుదల

Srisailam Project
Srisailam project : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. సోమవారం 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు, మంగళవారం మరో రెండు గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం 5 గేట్ల ద్వారా నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్ వైపు ప్రవహిస్తోంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు.
శ్రీశైలం జలాశయం స్పిల్ వే ద్వారా 1.35 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లూ 4.27 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లూ 2.21 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.7 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 202.9 టీఎంసీలు ఉంది.