YCP Cheap Politics : ఏపీలో కొనసాగుతున్న కేసుల పర్వం.. టీడీపీని టార్గెట్.. వై‘ఛీ’పీ రాజకీయం
YCP Cheap Politics : ఏపీలో ప్రతిపక్షాలు, ప్రత్యర్థులపై కేసుల పర్వం కొనసాగుతున్నది. ఎన్నికల వరకు తమ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడమే పనిగా అధికారంలోని వైసీపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది. ప్రతిపక్ష పార్టీల నేతలెవరూ ప్రజల్లో ఉండకుండా జైలు గోడల మధ్యే ఉండాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది. వరుస కేసులు పెడుతూ అందరినీ జైలుకు పంపిస్తున్నది.
రాష్ర్టంలో రెండు నెలలుగా ఎక్కడ చూసినా టీడీపీ నేతలపై కేసుల పర్వమే కొనసాగుతున్నది. టీడీపీ ఇటీవల ప్రజల్లోనే ఉంటున్నది. రాజమండ్రిలో నిర్వహించిన మహానాడు తర్వాత జోరు పెంచింది. ఇక భవిష్యత్ కు గ్యారెంటీ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లో ఉంటే, యువగళం పాదయాత్ర ద్వారా యువనేత లోకేశ్ కూడా రాష్ర్టం మొత్తం తిరుగుతున్నారు. ఇదంతా తనకు ఇబ్బంది అనుకున్నారో ఏమో గాని ఒక్కసారిగా తన ప్రత్యర్థులపై ఏపీ సీఎం జగన్ తన దర్యాప్తు సంస్థలను వదిలారు. ఏపీ సీఐడీ చేత కేసులను తోడించి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా కేసులు మొదలుపెట్టారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అంటూ ఆయనను 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీని చేశారు. ఇక అక్కడితో ఆగకుండా ఆయన పై వరుసగా ఎనిమిది కేసులు సీఐడీ చేత నమోదు చేయించారు. ఇక ఆయన ముందస్తు బెయిల్ పై బయటకు వచ్చారు. అయినా జగన్ కసి చల్లారినట్లు కనిపించడం లేదు. టీడీపీ కి చెందిన నియోజకవర్గ ఇన్ చార్జిలను టార్గెట్ చేశారు. ధూళ్లిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర, బీటెక్ రవి, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే అందరిపై కూడా కేసుల పరంపర కొనసాగుతున్నది. వీరే కాకుండా మరి కొందరిపై కూడా కేసులు నమోదు చేశారు.
టీడీపీ నేతలను జైలుకు పంపించి, వైసీపీ నేతలు వై ఏపీ నీడ్స్ జగన్, సామాజిక సాధికార యాత్ర అంటూ ఇక ప్రచారానికి తెరదీశారు. ప్రత్యర్థుల్ని కేసుల్లో ఇరికించి గెలవాలనే ప్రయత్నానికి, కుట్రలకు తెరదీశారు, అయితే ఇదంతా ప్రజలు గమనిస్తున్నారనే అసలు విషయం మరిచిపోయారు. ఇక వైసీపీ నేతలే ఈ అరెస్టుల పరంపరపై పెదవి విరుస్తున్నారు. రేపు ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఇంతకంటే దారుణండా ఉండే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా ఏపీ ప్రభుత్వం తీరు ఎన్నికల ముందు విమర్శలపాలవుతున్నది.