Firecrackers : బాణసంచా తయారు చేస్తుండగా పేలి ఒకరి మృతి

firecrackers
Firecrackers : అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలోని ఓ ఇంట్లో బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఇంట్లో బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు జరగడంతో కాళీ కృష్ణ అనే యువకుడు మృతి చెందగా ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను కాకినాడ జీజీహెచ్ తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడి తల్లిదండ్రులకు కూడా గాయాలవడంతో వారిద్దరినీ మండపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు.