One Modi Many Forms : మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిష్మా తగ్గడం లేదు. మన ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లడంలో ఆయన పాత్ర కీలకమే. దేశ ఔన్నత్యాన్ని పెంచడంలో ముందున్నారు. ప్రపంచ నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రధాని విధానాల వల్ల మన దేశం పురోగమిస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు పలు సర్వేలు కేంద్రంలో మళ్లీ మోడీనే ప్రధాని కావాలని సూచిస్తున్నాయంటే మోడీ స్థాయి ఏమిటో అర్థమవుతోంది.
మోడీకి ఏ వేషం వేసినా అందులో ఒదిగిపోవడం సహజమే. తలపాగా చుట్టినా టోపీ ధరించినా ఆయన జోష్ వేరుగానే ఉంటుంది. ముసిముసి నవ్వుల మోడీ ఏం చేసినా సంచలనమే. చాయ్ వాలా ప్రధాని కావడమే గమ్మత్తు అని దేశమంతా అనుకుంటారు. చేసే పనిలో నిబద్ధత ఉంటే ఏదైనా సాధ్యమే అని మోడీ నిరూపించుకున్నారు. అందుకే ఆయన బహురూపాల్లో దర్శనమిస్తుంటారు.
పలు దేశాలు తిరిగే సందర్భంలో అక్కడి సంప్రదాయం ప్రకారం వేషధారణ చేసుకుంటారు. దీంతో అక్కడి వారి మనసు గెలుచుకుంటారు. దీంతో మోడీ రూపాలు చూడతరమా అన్నట్లు ఆయన వేషధారణ చూస్తే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. మోడీ అంటే ఇన్ని రకాలుగా ఉంటారా? అనే ప్రశ్నలు రావడం సహజమే. ఇలా మోడీ తనదైన శైలిలో వేషధారణ చేసుకునే సందర్భంలో ఆయన రూపాలు మనకు దర్శనమిస్తుంటాి.
మోడీ తనదైన శైలిలో నడుచుకుంటారు. అన్ని దేశాల సంప్రదాయాలను గౌరవిస్తారు. అన్ని ప్రాంతాల అతిథులను ఆహ్వానిస్తుంటారు. మా దేశం రండి అంటూ స్వాగతం పలుకుతుంటారు. మోడీ విధానాలు, పనులు కూడా కొత్తగానే ఉంటాయి. ఈనేపథ్యంలో మోడీ పథకాలు దేశానికి ఎంతో అవసరం. ప్రజల సౌకర్యార్థం పలు పథకాలు తీసుకొచ్చి వారి మనసులు గెలుచుకోవడం చూస్తున్నాం.