Telangana : ప్రస్తుతం తెలంగాణలో ఒకే ఒక పేరు వినిపిస్తుంది అదే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సభలు, సమావేశాలు, రోడ్డు షోలు, మీడియా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఇలా కాంగ్రెస్ లో ప్రతీ ఒక్క దానిలో రేవంత్ ముందుగా కనిపిస్తున్నారు. పార్టీని ప్రభుత్వంలోకి తీసుకువచ్చే బాధ్యతను తన భూజాలపై వేసుకొని నడిపిస్తున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రేవంత్ రెడ్డి తెలంగాణలో పార్టీ గమనాన్ని మార్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు సానుకూల ఊపు రావడానికి రేవంత్ నాయకత్వమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి రోజూ సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లలో చురుకుగా పాల్గొంటూ పార్టీ ప్రచారాన్ని ముందుకు నడిపించేందుకు ఆయన పార్టీ ప్రజాదరణను ఓట్లుగా మలుచుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్, కోమటిరెడ్డి సోదరులు, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క వంటి నేతలు దీనికి విరుద్ధంగా తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. ఈ కాంగ్రెస్ నాయకులు తమ వ్యక్తి గత విజయాల కోసం సహకరిస్తున్నప్పటికీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి జాతీయ నాయకులు ప్రధానంగా అధికారిక సమావేశాల్లో కనిపిస్తున్నారు. ఇతర సమయాల్లో వారి దృష్టిని వారి నియోజకవర్గాల వైపునకు మళ్లిస్తున్నారు.
అయితే రేవంత్ మాత్రం రాష్ట్రం మొత్తం తిరుగుతూ పాలక పక్షానికి ఎదురెళ్తున్నాడు. ఆయన డైనమిక్ విధానం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే సీఎం పదవి ఖాయమని కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి రేవంత్ కు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు పార్టీలో టాక్ వినిపిస్తుంది. ఈ హామీతో రేవంత్ మరింత జోరుగా పార్టీని ఎలాగైనా గెలిపించాలని చూస్తున్నారని ప్రచారం నడుస్తోంది.