Tejpal Singh : 26 ఏండ్లలో ఒక్క రోజే సెలవు..ఈయన పనితనానికి చేతులెత్తి మొక్కాలి భయ్యా.. బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి పేరు..
Tejpal Singh : మనలో చాలా మంది పని ఎగ్గొట్టేవారే కనపడుతారు. చీటికిమాటికి సెలవులు పెడుతూ బాస్ లకు కోపం తెప్పిస్తుంటారు. కానీ అక్కడక్కడ వర్క్ హాలిక్ పర్సన్స్ కూడా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో కెల్లా అగ్రగామి తేజ్ పాల్ సింగ్ అని చెప్పవచ్చు. ఈయన ఉత్తర ప్రదేశ్ లోని ద్వారికేష్ షుగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో పనిచేసిన ఒక క్లర్క్ ఆదివారాలు, హోలీ, దీపావళి లాంటి ఇతర సెలవు దినాల్లోనూ పనిచేసినట్టు సమాచారం.
1995 నుంచి 2021 వరకు కంపెనీతో అనుబంధం ఉన్న సమయంలో అతడు గత 26 సంవత్సరాల్లో ఒక్క రోజు మాత్రమే సెలవు అడిగాడు. ఇప్పుడు తేజ్ పాల్ సింగ్ పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. అతడిని నిజాయితీ, పని పట్ల నిబద్ధత అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కంపెనీ తమ పాలసీ ప్రకారం ఏటా 45 రోజుల సెలవును అందిస్తున్నప్పటికీ, ఈ వ్యక్తి 2003లో తన సోదరుడి వివాహ వేడుకలను జరుపుకోవడానికి తీసుకున్న సెలవు కాకుండా, మిగతా వాటిని కూడా ఉపయోగించుకోలేదు. అతను నలుగురు పిల్లలకు తండ్రి. ఇప్పుడు దేశమంతా తేజ్ పాల్ సింగ్ గురించి తెలుసుకుంటోంది. ఇలాంటి వారు అరుదుగా ఉంటారు. అందరూ ఇలానే ఉండాలని ఏం లేదు అని అంటున్నారు విశ్లేషకులు. జీవితంలో పైకి రావాలన్న గట్టి సంకల్పం ఉన్నవారు వర్క్ హాలిక్ లా ఉండడంతో పాటు అప్పుడప్పుడు కాస్త రిలాక్స్ కూడా కావాలని చెబుతున్నారు. అప్పుడే పని మరింత రాటుదేలుతుందని అంటున్నారు.