Human Microbes : మనుషుల మలానికి కోటిన్నర.. ఓ కంపెనీ ఆఫర్

Human Microbes
Human Microbes : తమకు మలాన్ని ఏడాది పాటు ఇచ్చేవారికి ఏడాదికి కోటిన్నర రూపాయలను ఇస్తామని ఓ కంపెనీ ఆఫర్ చేసింది. మానవ మలంతో పలు రోగాలకు చికిత్స చేయవచ్చని ఆ కంపెనీ చెబుతోంది. దరఖాస్తు చేసుకున్న వారిలోంచి తాము అర్హులను ఎంపిక చేసుకొని మలం శాంపిళ్లు తీసుకుంటామని చెబుతోంది. వినడానికి జుగుప్సాకరంగా ఉన్న ఈ ఆఫర్ ప్రకటించిన సంస్థ పేరు హ్యూమన్ మైక్రోబ్స్. మరి మానవ మలాన్ని సేకరించడం వెనుక ఉన్న కారణాన్ని కూడా సంస్థ వివరించింది.
మనిషి పేగుల్లో రకరకాల హితకర బ్యాక్టీరియా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇవి రోజు మలం ద్వారా బయటకు పోతుంటాయి. మానసిక, శారీరక ఆరోగ్యానికి పేగుల్లోని బ్యాక్టీరియా ఎంతో కీలకం. పేగుల్లో బ్యాక్టీరియాలో అసమతౌల్యం కారణంగా అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి మానవ మలంతో పరిష్కారం చూపెట్టొచ్చని హ్యూబన్ మైక్రోబ్స్ సంస్థ చెబుతోంది.