ABP-C Voter Opinion Poll : మరోసారి సర్వే, గెలుపు ఖాయమంటున్న టీడీపీ!

ABP-C Voter Opinion Poll

ABP-C Voter Opinion Poll

ABP-C Voter Opinion Poll : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో సర్వే సంస్థలు మరోసారి యాక్టివ్ అయ్యాయి. ఎన్నికల ఫలితాలపై ఒపీనియన్ పోల్స్ రూపొందిస్తున్నాయి.

ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మెజారిటీ లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని తాజా సర్వేలు చెబుతున్నాయని టీడీపీ పేర్కొంది.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 44.7 శాతం ఓట్లు వస్తాయని ఏబీపీ-సీ ఓటర్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 41.9 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

ఎన్డీయే కూటమికి 20 లోక్‌సభ స్థానాలు, 140 అసెంబ్లీ స్థానాలు, వైసీపీకి 5 లోక్ సభ స్థానాలు, 35 అసెంబ్లీ స్థానాలు వస్తాయని సర్వే పేర్కొంది.

తెలంగాణలో కాంగ్రెస్ కు 42.9 శాతం ఓట్లు, 10 లోక్ సభ స్థానాలు, బీజేపీకి 25.1 శాతం ఓట్లు, నాలుగు లోక్ సభ స్థానాలు వస్తాయని ఏబీపీ-సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. బీఆర్ఎస్ కు 28.4 శాతం ఓట్లు వస్తాయని, అయితే ఆ పార్టీకి కేవలం 2 లోక్ సభ స్థానాలు మాత్రమే వస్తాయని తెలిపింది.

ఏబీపీతో పాటు న్యూస్-18 మెగా ఒపీనియన్ పోల్ కూడా ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాలకు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 18 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. వైసీపీకి 7 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

ఈ సర్వేలతో టీడీపీ, జనసేన కేడర్ ఆనందంగా కేరింతలు వేస్తుంది. ఐదేళ్ల ఎదురు చూపులకు కాలం చెల్లిందని త్వరలో టీడీపీ వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత కూడా కేడర్ ను ఉర్రూతలూగిస్తున్నాడు. వచ్చేది తమ ప్రభుత్వమేనని ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు విశ్రమించవద్దని సూచిస్తున్నారు.

TAGS