Hardik Pandya : మరో సారి హర్దిక్ పాండ్యా విడాకుల వార్తలు వైరల్
Hardik Pandya : టీం ఇండియా టీ 20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచి సంబరాల్లో మునిగిపోగా.. అందరూ క్రికెటర్లు తమ భార్యా పిల్లలతో ఎంజాయ్ చేశారు. కానీ హర్దిక్ పాండ్యా ఒక్కడే సింగిల్ గా ఇండియా జెండా పట్టుకుని బార్బడోస్ లో స్టేడియం అంతా కలియతిరిగాడు. అయితే భార్య నటాషా స్టాంకోవిచ్ తో విబేధాల కారణంగానే ముంబయిలో జరిగిన టీ 20 వరల్డ్ కప్ సంబరాల్లో ఆమె పాల్గొనలేదని తెలుస్తోంది.
తాజాగా ముఖేశ్ అంబానీ కొడుకు పెళ్లిలో కూడా హర్దిక్ పాండ్యా ఒక్కడే కనిపించాడు. నటాషా సెర్బియా నటి కాగా.. ఆమెను హర్దిక్ పాండ్యా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హర్దిక్ పాండ్యా నటాషా కు ఒక బాబు కూడా జన్మించాడు.
గతేడాది వరకు బాగానే ఉన్నా జంటకు ఎక్కడా విబేధాలు వచ్చాయో తెలియదు. కానీ వీరిద్దరి మధ్య విడాకుల రూమర్స్ వచ్చాయి. దీనిపై ఎవరూ వ్యక్తిగతంగా ఇంతవరకు మాట్లాడకున్నా.. ఇది దాదాపు నిజమనే తెలుస్తోంది. హర్దిక్ పాండ్యాతో విడాకుల కోసం నటాషా ఇప్పటికే 70 హర్దిక్ ఆస్తిని రాసివ్వాలని కోరినట్లు ప్రచారం జరిగింది. అయితే దీనికి ముందుగానే హర్దిక్ తన ఆస్తి మొత్తాన్ని అమ్మ పేరు మీద రాశాడని దీంతో నటాషాకు ఏం చేయాలో తోచడం లేదని తెలుస్తోంది. నటాషా స్టాంకోవిచ్ తో నాలుగేళ్ల బంధానికి హర్దిక్ వద్దనుకుంటున్నాడని సమాచారం.
హర్దిక్ పాండ్యా గత ఆరు నెలల కాలంలో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. ఇటు భార్య, అటు ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ చేపట్టాక.. జట్టు ఓటమి.. ఫ్యాన్స్ నుంచి చీదరింపులు, ఇలా అన్ని ప్రతికూలంశాలుగా మారాయి. అయితే వీటికి సంబంధించి ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డా కూడా దాన్ని గేమ్ పైన చూపించలేదు. ఇదే హర్దిక్ టీ 20 ప్రపంచ కప్ భారత్ కు అందించడానికి సాధ్యమైంది. అయితే వీరు విడిపోవడానికి మాత్రం సరైన కారణాలు ఇప్పటి వరకు బయటకు తెలియడం లేదు.