Ramoji Rao : మరోసారి బలంగా రామోజీరావుకు భార‌త‌ర‌త్న డిమాండ్

Ramoji Rao

Ramoji Rao

Ramoji Rao : తెలుగు ప్రజలకు రామోజీరావు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు ప్రజలు గ‌ర్వించ‌ద‌గిన వ్యక్తుల్లో రామోజీరావు ఒక‌రు. ప‌త్రికాధినేత‌గా, నిర్మాత‌గా, వ్యాపార‌వేత్తగా ఆయ‌నది చెదరని ముద్ర. ఆయన ఎంతో మందికి ఆదర్శం. వేలాదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించి, వాళ్ల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు. ముఖ్యంగా ప‌త్రికారంగంలో ఆయ‌న సేవలు,  చేసిన సాహ‌సాలు, వేసిన కొత్త అడుగులు ఓ చరిత్రగా చెప్పుకొవచ్చు. రామోజీరావు కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయనను పద్మ విభూషణ్ తో సత్కరించింది. ఇటీవల ఆయన మరణించిన సంగతి తెలిసిందే. ఆయన సంస్కరణ సభను విజయవాడలో ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. ప్రస్తుతం ఆయనకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌న్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఆయన సంస్కరణ స‌భ సంద‌ర్భంగా  రామోజీరావుకు భార‌త‌ర‌త్న డిమాండ్ ఇంకోసారి బ‌లంగా వినిపించారు. రామోజీ రావు సంస్కరణ సభకు భారీగా అతిరథమహారథులు హాజరయ్యారు. చంద్రబాబు, రాజ‌మౌళి త‌దిత‌రులు భారతరత్నపై గళం విప్పారు.  

ప్రస్తుతం కేంద్రప్రభుత్వంలో టీడీపీ కూట‌మి భాగ‌స్వామిగా ఉంది. చంద్రబాబు, జ‌న‌సేన భాగ‌స్వామ్యంతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. సీఎం చంద్రబాబు  కాస్త దృష్టి పెడితే, రామోజీరావుకు భార‌త‌ర‌త్న సాధించ‌డం పెద్ద క‌ష్టమేమీ కాదు. పైగా రామోజీరావుకూ మోదీకి మంచి సంబంధాలే ఉన్నాయి.  అందుకే భార‌త‌ర‌త్న ఆశ‌లు రామోజీ అభిమానుల్లో  మ‌రింత చిగురించాయి. కాక‌పోతే.. భార‌తర‌త్న తెలుగు వాళ్లకు ఇవ్వాలంటే ముందుగా ఎన్టీఆర్ నుంచి మొద‌లు పెట్టాలి. ఈ క్రమంలో ఘంట‌సాల లాంటి మ‌హామ‌హుల పేర్లు ఈ వ‌రుస‌లో క‌నిపిస్తాయి. వాళ్లకు ఇచ్చిన తర్వాతే ఆ అవకాశం రామోజీ రావు వరకు వస్తుంది. ముందుగా ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న తెచ్చుకొనే బాధ్యత టీడీపీ ప్రభుత్వం పై ఉంది.  చాలా ఏళ్లుగా ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న పెండింగ్ లో ఉంది. ఈ ఐదేళ్లలో ముందుగా ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న తెచ్చుకుంటే, ఆ త‌ర‌వాత మిగిలిన‌వాళ్ల గురించి అడ‌గొచ్చు.

TAGS