JAISW News Telugu

America : మరోసారి ఉలిక్కిపడ్డ అమెరికా.. ముగ్గురు మృతి.. 16 మందికి పైగా గాయాలు.. అసలేం జరిగిందంటే?

America

America : పేరుకే అగ్రరాజ్యం కానీ ఆ దేశంలో మాత్రం దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షు లా ఉంది పౌరుల పరిస్థితి. దీనికి కారణం గన్ కల్చరే అని తెలిసినా అధికారులు మాత్రం వాటిపై చర్యలు తీసుకోరు. ఫలితంగా ఎవరికైనా కోపం కట్టలు తెంచుకుంటే పిస్తోల్ తీయాల్సిందే.. కనిపించిన వారిని కనిపించినట్లు కాల్చేయాల్సిందే.

మొన్నటికి మొన్న అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు జరిగాయి. ఆయనను హత్య చేసేందుకు దుండగులు పన్నాగం పన్నారు. కానీ ఆయన మాత్రం క్షణాల్లో తప్పించుకోగా.. ఆయన వెనుకున్న ఇద్దరు మరణించారు. ఇది అమెరికాతో పాటు ప్రపంచాన్ని ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన మరువక ముందే.. నైట్ క్లబ్ వేదికగా మరో ఘటన వెలుగు చూసింది. ఇందులో ముగ్గురు మరణించగా.. 16 మంది గాయపడ్డారు.

అమెరికాలో కాల్పుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. నైట్‌ క్లబ్‌ వేదికగా ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టగా.. 16 మంది తీవ్రమైన గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. మిస్సిస్సిపీ రాష్ట్రంలోని ఇండియానాలో ఉన్న చర్చి స్ట్రీట్‌ నైట్‌ క్లబ్‌లో దారుణం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన వారిని హాస్పిటల్ కు తరలించారు.

కాల్పుల అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఎందుకు కాల్పులు జరిపాడు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవలే ఇదే ప్రాంతంలో భారత సంతతి వ్యక్తిపై ఓ డ్రైవర్‌ కాల్పులు జరిపాడు. కారును ఢీకొన్న విషయంపై గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన డ్రైవర్‌ ఆ వ్యక్తి మెడపై కాల్చాడు. చికిత్స పొందుతూ బాధితుడు ప్రాణాలు వదిలాడు.

Exit mobile version