OTT : ఓటీటీ నుంచి మరోసారి కొరటాలకు ఎదురుదెబ్బ..

OTT

OTT in Devara

OTT : కొరటాల శివ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సినిమా ‘దేవర’. ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో హల్చల్ చేస్తోంది. నవంబర్ 8న స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో నెం.1 ట్రెండింగ్ పొజిషన్ కు దూసుకెళ్లింది. దీనికి ఓటీటీ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమాలో క్యారెక్టరైజేషన్లు, అసంబద్ధమైన సన్నివేశాలతో కొరటాల శివ విసుగుతెప్పించాడని ఓటీటీలో చూసిన వారు అంటున్నారు. చాలా సన్నివేశాల్లో రచన పేలవంగా, సోమరితనంగా ఉంది.

కొరటాల శివ కూడా ఎన్టీఆర్ టాలెంట్ కు న్యాయం చేయలేదని టాక్ ఓటీటీ వ్యూవరస్ నుంచి వినిపిస్తోంది. తారక్ ను బెస్ట్ గా చూపించడంలో ఫెయిల్ అయ్యాడని అంటున్ వారు ఉన్నారు. ముఖ్యంగా ఇంటర్‌డక్షన్ ఇంటర్వెల్ సీన్స్ లో ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ను హైలైట్ చేశాడు రాజమౌళి, కానీ దేవరలో అలా జరగలేదు. పాత్ర పరంగా ఒకే అనుకున్నా.. మరింత ఎలివేట్ చేస్తే బాగుండని అంటున్నారు.

చాలా సన్నివేశాల్లో ఎన్టీఆర్ మరుగుజ్జుగా కనిపించాడు. కెమెరామెన్ రత్నవేలు కెమెరా వర్క్ పై ట్రోల్ వస్తున్నాయి. కాన్వాస్ ను పెంచడం వల్ల హీరో చిన్నగా కనిపించేలా చేయడం అతని ఫ్రేమింగ్ భయంకరంగా ఉంది. జాన్వీ కపూర్ పాత్రను అసభ్యంగా, డిజైన్ చేయడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఆమె పాత్రకు ఔచిత్యం, ఉద్దేశం లోపించాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మాణ విలువలు అంతంతమాత్రంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ స్టార్ డమ్ ను, సామర్థ్యాలను దుర్వినియోగం చేసిన ఈ నిర్మాణ సంస్థతో ఎన్టీఆర్ పనిచేయకూడదని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

ఊహించినట్లుగానే దేవర పాత్ర కంటే వరుడిగా ఎన్టీఆర్ నటనకు ఓటీటీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. హార్డ్ కోర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమాకు రిపీట్ వాల్యూ లేదని అంటున్నారు. అంతిమంగా ఎన్టీఆర్ నటన, కొన్ని ఎలివేషన్ సీన్స్, అనిరుధ్ సంగీతం, మరీ ముఖ్యంగా ప్రత్యేకమైన వాటర్ సెట్టింగ్ దేవరను కాపాడి థియేట్రికల్ హిట్ గా నిలిపాయి.

ఓవరాల్ గా దేవర 2 ప్లాన్ చేయాలంటే కొరటాల శివ రైటింగ్, ఫిల్మ్ మేకింగ్ లో చాలా ఇంప్రూవ్ మెంట్ చేయాల్సి ఉంది. ఈ సారి అతనికి అదృష్టం దక్కింది, కానీ ప్రతిసారీ అలా ఉండకపోవచ్చు.

TAGS