Star Heroine : చాలా మంది కెరీర్ లో జీవితంలో ఒకటి కావాలనుకుని మరో దానితో సంతృప్తి పడుతుంటారు. కానీ కొంతమందికి మాత్రం మంచి అవకాశాలు వచ్చి జీవితంలో తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలా చాలా మంది సెలెబ్రెటీలుగా మారిపోయి ఉన్నత స్థాయి జీవితాన్ని అనుభవిస్తుంటారు. అలాంటిదే పై ఫొటోలో ఉన్నభామ. ఈమె ముందు న్యూస్ రీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. తమిళలో పెద్ద హిరోయిన్ గా పేరు సంపాదించుకుంది.
ఆమె ప్రియా భవానీ శంకర్. ఈమె 1989 లో తమిళనాడులో పుట్టింది. న్యూస్ ప్రజెంటర్ గా పుతియ లైమురైలో పని చేసింది. అనంతరం అనేక సీరియల్స్ లో నటించింది. కల్యాణ్ ముదల్ కాదల్ వరై సీరియల్స్ లో ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించింది. వైభవ్ రెడ్డి హిరోగా వచ్చిన మేయదా మూన్ అనే సినిమాతో హిరోయిన్ గా పరిచయం అయింది.
అరంగ్రేటం మూవీతోనే సైమా అవార్డు అందుకుని ప్రశంసలు పొందింది. అనంతరం కార్తీతో కడై కుట్టి సింగం సినిమాలో సెకండ్ హిరోయిన్ గా అలరించింది. సూర్య కు జోడిగా మాన్ స్టర్ మూవీలో నటించి ప్రేక్షకుల ఆదరణ చూరగొంది. హాస్టల్, యానామ్, బ్లడ్ మనీ, మన్నేపిన్నే అనే తదితర చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించింది. తమిళంలో తిరు సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమాలో ధనుష్ హిరోగా నటించగా.. హిరోయిన్ గా ప్రియా భవానీ చాన్స్ కొట్టేసింది.
కల్యాణం కమనీయం సినిమాతో తెలుగులో ఆఫర్ కొట్టేసి తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది. నాగచైతన్య నటించిన వెబ్ సిరీస్ దూతలో కనిపించింది. గోపిచంద్ బీమా సినిమాలో యాక్ట్ చేసి తెలుగులో ఆడియన్స్ కు మరింత చేరువైంది. ప్రస్తుతం ఈ కోలీవుడ్ భామకు తెలుగులో చాలా ఆఫర్లు వస్తున్నాయట. కానీ ఆచితూచి వాటిని సెలెక్ట్ చేసుకుంటుందని సినీ వర్గాల టాక్. అయినా ఒక న్యూస్ ప్రెజెంటర్ ఇంత సక్సెస్ ఫుల్ హిరోయిన్ గా మారిపోవడం చూసి చాలా మంది అదృష్టమంటే ఈమెదే అని అనుకుంటున్నారు.