Karthika Purnima : కార్తీక పౌర్ణమి అత్యంత భక్తితో కూడిన మాసం. ఈ నెలలో శివకేశవులకు పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని చెబుతుంటారు. ఉదయాన్నే నదీస్నానాలు చేస్తూ దీపాలు వెలిగిస్తూ దేవుళ్లను కొలవడం సహజం. దీంతో రాష్ట్రంలోని ప్రముఖ నదులు, దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు ఇంకా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజు భక్తులు నదుల్లో స్నానం చేసి దీపాన్ని వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతుంటారు. దీని కోసమే అహర్నిషలు ఆలోచిస్తుంటారు.
కార్తీక పౌర్ణమి కూడా రెండు రోజులు వచ్చింది. దీంతో ఏ రోజు జరుపుకోవాలనే దానిపై అందరిలో అనుమానాలు వస్తున్నాయి. నవంబర్ 26,27 రెండు రోజులు పౌర్ణమి ఘడియలు ఉండటంతో ఏ రోజు కార్తీక పౌర్ణమి జరుపుకోవాలని చెబుతున్నారు. ఎప్పుడు జరుపుకోవాలనేదానిపై సందిగ్ధత నెలకొంది. ఈనేపథ్యంలో కార్తీక పౌర్ణమి జరుపుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నవంబర్ 26న మధ్యాహ్నం 3.53 గంటల నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 2.45 గంటల వరకు ఘడియలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీపం వెలిగిస్తున్నప్పుడు పౌర్ణమి ఘడియలు, క్రుత్తిక నక్షత్రం ఉండాలి. 26నే ఈ ఘడియలు ఉన్నందున ఆ రోజే జరుపుకోవాలని చెబుతున్నారు. అందుకే 26నే కార్తీక పౌర్ణమివేడుకలు జరుపుకోవాలని సూచిస్తున్నారు.
ఈ సంవత్సరం అన్ని పండగలు కూడా రెండు రోజులు రావడంతో ఏ రోజు జరుపుకోవాలనే దానిపై సంశయాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం వాట్సాప్ లు ఉండటంతో భక్తులను తప్పుదారి పట్టిస్తున్నారు. కొందరు ఓ రోజని చెబితే మరికొందరు మాత్రం ఇంకో రోజు జరుపుకోవాలని మిస్ గైడ్ చేస్తున్నారనే వాదనలు కూడా రావడం సహజమే. ఎవరో చెప్పింది కాకుండా తిథి, నక్షత్రం ప్రకారం ఏది కరెక్టో అదే పాటించడం సమంజసం.