JAISW News Telugu

Chandrababu – Revanth : ఇరు రాష్ట్రాల సీఎంల భేటీపై ఎవరి గోల వారిదే!

CM Chandrababu - CM Revanth,

CM Chandrababu – CM Revanth

CM Chandrababu – CM Revanth : ఒకరు ఏదైనా మంచి చేస్తున్నారంటే చాలు ఇతరులు వారిపై నిందలేసి ఆ తర్వాత వచ్చే నిప్పుతో చలి కాచుకునేందుకు రెడీ అవుతారు. ఎందుకు రాస్తారో.. ఎలా వస్తారో తెలియదు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అనాలోచితంగా రాస్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ భేటీలో తెలంగాణ డిమాండ్ చేస్తుందంటూ కొన్ని అంశాలను తెరపైకి తెచ్చారు.

నిజానికి ఒక రోజు ముందే 10 అంశాలను ఇరువైపులా సీఎంలు ఎజెండాగా ప్రకటించారు. అధికారిక ప్రకటనలో కేవలం విభజన చట్టంలో ఉండి.. పరిష్కారం కాని సమస్యల గురించి మాత్రమే చర్చ ఉంటుందని ఉంది. సమావేశం కూడా అందుకే.. ఎజెండాలో ఉన్నవి కాకుండా మరే అంశంపై చర్చించినా అది అధికారికం కాదు. కానీ తెలంగాణ సీఎం ఏపీలో తీరాన్ని అడుగుతున్నాడని.. పోర్టులు అడుగుతున్నాడని, తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా అడుగుతున్నారని రాసుకొచ్చేశారు. వాటిని చూపించి పార్టీలన్నీ రాజకీయాలు చేస్తున్నాయి.

అసలు ఈ లీకులు ఎలా బయటకు వచ్చాయో స్పష్టత లేదు. కానీ తెలంగాణ ఆస్తులు ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి ఇది కౌంటర్. రేవంత్ రెడ్డి ఆషామాషీ సీఎం కాదని తన రాష్ట్రం కోసం చాలా అడుగుతారని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. రేవంత్ పెట్టిన డిమాండ్లను బీఆర్ఎస్ కూడా ఎప్పుడూ పెట్టకపోవడంతో వారు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. ఏపీలో అయితే ఎలా స్పందించాలో అనేది వైసీపీకి తెలియడంలేదు.

అసలు ఏడు మండలాల ఇష్యూ విభజన చట్టంలో లేదని.. అందుకే ఎజెండాలో పొందుపరచలేదని తెలుస్తోంది. మరో వైపు అవేమీ వద్దు 5 గ్రామాలు మాత్రమే చాలని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారట. మధ్యలో ఈ డిమాండ్లు ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికీ అర్థం కవడం లేదు.

Exit mobile version