PM Modi : పీఎం మోదీ త్వరలో ఉక్రెయిన్ లో పర్యటించనున్నారు. వచ్చే నెల 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సమావేశం కానున్నారు. దీంతో రష్యాతో యుద్ధం తర్వాత ప్రధాని ఆ దేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి. ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా మోదీ, జెలెన్ స్కీ భేటీ అయ్యారు. అంతకుముందు భారత్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించిన మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. తీరిక చేసుకొని ఉక్రెయిన్ లో పర్యటించాల్సిందిగా మోదీని ఆయన కోరారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని కీవ్ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం.
కాగా, మోదీ ఈ నెల 8న రష్యాలో రెండు రోజుల పాటు పర్యటించారు. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని పుతిన్ మోదీకి అందజేశారు. ఇండియా-రష్యా 22వ వార్షిక సమావేశం సందర్భంగా ప్రధానిని రష్యాలో పర్యటించాలని పుతిన్ ఆహ్వానించిన విషయం తెలిసిందే.