-17న టీడీపీ, బీజేపీ, జనసేన బహిరంగసభకు భూమిపూజ చేసిన ‘పాతూరి’, నేతలు
AP Politics : పొత్తు తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి నిర్వహిస్తున్న భారీ బహిరంగసభకు వేదిక సిద్ధమైంది. ఈ మేరకు మూడు పార్టీల నేతలు కలిసి సభావేదిక వద్ద భూమిపూజ చేశారు.
ఈనెల 17న ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడి గ్రామం నందు బీజేపీ – టీడీపీ జనసేన కూటమి నేతృత్వంలో భారీ బహిరంగ సభ జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పాల్గొనబోతున్నారు.
ఈ బహిరంగసభ కార్యక్రమాలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ , టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు . అచ్చెన్నాయుడు గారు, బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం , ప్రత్తిపాటి పుల్లారావు , జనసేన నాయకులు రామకృష్ణ మరియు మూడు పార్టీల రాష్ట్ర, జాతీయ నేతలు భూమిపూజ చేశారు. భారీగా మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.