JAISW News Telugu

Omar Abdullah : నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభా పక్షనేతగా ఒమర్ అబ్దుల్లా

Omar Abdullah

Omar Abdullah

Omar Abdullah : నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్ష నేతగా మాజీ సీఎం ఒబర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జమ్మేకశ్మీర్ లో ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలు నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమికి అధికార పీఠాన్ని కట్టబెట్టాయి. ఈ క్రమంలోనే ఎన్ సీ శాసనసభాపక్ష నేతగా ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు.

90 అసెంబ్లీ స్థానాలున్న జమ్ముకశ్మీర్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఫలితాల్లో ఒక్క ఎన్సీనే 42 సీట్లను గెలుచుకోగా.. కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలుపొందింది. తాజాగా ఎన్సీకి నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. దీంతో ఎన్సీ కూటమి బలం 46 నుంచి 50కి పెరిగింది. 29 స్థానాలు గెలుచుకున్న బీజీపీకి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు లభించింది.

Exit mobile version