Om Birla : 18వ లోక్ సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాణి ఓటుతో ఆయన గెలుపొందినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి ప్రకటించారు. స్పీకర్ కుర్చీ వరకు ఓం బిర్లాను ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోడ్కొని వెళ్లి కూర్చొబెట్టారు. దీంతో ఓం బిర్లా వరుసగా రెండోసారి లోక్ సభ స్పీకర్ బాధ్యతలు చేపట్టారు. ఓం బిర్లా రాజస్థాన్ లోని కోటా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. వరుసగా మూడోసారి ఎంపీగా విజయం సాధించారు.
డిప్యూటీ స్పీకర్ పోస్టు ప్రతిపక్షాలకు ఇవ్వనందుకు ఇండియా కూటమి స్పీకర్ ఎన్నిక బరిలో అభ్యర్థిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమి తరపున కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సురేశ్ స్పీకర్ పోస్ట్ కు నామినేషన్ వేశారు. అయితే ఈరోజు సభలో మూజువాణి ఓటుతో స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు.