Manu Bakar : పారిస్ ఒలింపిక్స్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టలం క్వాలిఫికేషన్ లో మను బాకర్ మూడో స్థానంలో నిలిచి ఫైనల్ కు అర్హత సాధించింది. 580.27 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్ కు అర్హత సాధించింది. మరో భారత షూటర్ రిథమ్ సంగ్వాన్ 15వ స్థానంతో సరిపెట్టుకుంది. మేజర్ వెరొనికా (హంగేరి) 582.22 స్కోరుతో అగ్రస్థానంలో నిలవగా.. ఓహ్ యే జెన్ (దక్షిణ కొరియా) 580.20 స్కోరుతో రెండో స్థానం దక్కించుకుంది. టాప్-8లో నిలిచినవారు ఫైనల్ పోరుకు అర్హత సాధిస్తారు.
ఎయిర్ పిస్టల్ సింగిల్స్ లో 20 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన భారత షూటర్ గా మను బాకర్ రికార్డు సృష్టించింది. 2004 ఒలింపిక్స్ లో ఇదే విభాగంలో సుమా శిరూర్ ఫైనల్ కు చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ జులై 28న మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతాయి.