Old is Gold : ఆనందానికి వయసు అడ్డుకాదని నిరూసిస్తున్నారు బాలీవుడ్ వెటరన్ స్టార్స్. ఏజ్ అనేది ఒక నంబర్ మాత్రమే అని అంటున్నారు ఈ స్టార్స్. ఎలా ఆనందించాలో తెలిస్తే వయసు అనేది లెక్కలోకి రాదని చెబుతున్నారు.
వయసు అడ్డంకి కాదు
సూపర్ స్టార్ విషయానికి వస్తే వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నిజంగా నిరూపించారు. 80 ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ సినిమాల్లో ఇంకా బిజీగానే ఉన్నాడు. ఈ యవసులోనూ యువ ప్రేక్షకులను పెద్ద సంఖ్యలో థియేటర్లకు తీసుకురాగలుగుతున్నారు. ఒకప్పుడు యాంగ్రీ యంగ్ క్యారెక్టర్లతో బాలీవుడ్ ను ఏలిన ఈ సూపర్ స్టార్ ఇప్పుడు కొన్ని ప్రయోగాత్మక చిత్రాలతో పాటు సందేశాత్మక చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఈ బాలీవుడ్ బిగ్ బీ ‘వయస్సు అడ్డంకి కాదు’ అనేదానికి నిదర్శనంగా నిలుస్తున్నారు.
‘మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రంతో ప్రశంసలు అందుకున్నాడు బోమన్ ఇరానీ. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. వయసు పెరుగతున్నా తాను దానిని ఎప్పుడూ పట్టించుకోలేదని తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నానని చెబుతున్నాడు హోస్ట్ కమ్ బాలీవుడ్ యాక్టర్ ఇరానీ.
అనుపమ్ ఖేర్ బాలీవుడ్ లోకి వచ్చి దాదాపు 30 ఏళ్ల దాటింది. 65 ఏళ్లు దాటిన ఈ వెటరన్ యాక్టర్ కూడా ఏజ్ ను లెక్కలోకి తీసుకోవడం లేదు. తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కార్తికేయ-2లో నటించిన అనుపమ్ ఖేర్ సౌత్ సినిమాల్లోనూ నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇప్పటికీ ట్రెండింగ్ లో కేటిక సాంగ్..
అమితాబ్ బచ్చన్ , డానీ దంజోంగప్ప, అనుపమ్ ఖేర్, బోమన్ ఇరానీ, సారిక, నీనా గుప్తా కలిసి నంటించిన చిత్రం ఉంచై. ఇందులో వృద్ధులంతా కలిసి ట్రెక్కింగ్ వెళతారు. ఇందులో ప్రత్యేకంగా తీసిన పాట కేటిక సాంగ్ రీల్స్ లో వైరల్ అవుతున్నది. అలాగే వయసు అనేది ఆనందాలకు అడ్డు కాదని కూడా ఈ పాట నిరూపిస్తున్నది.
హుషారుగా డ్యాన్స్..
ఈ పాటలో ఈ స్టార్స్ అంతా హుషారుగా డ్యాన్స్ చేసి అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మరింత జోష్ తెప్పించారు. తమ ఆనందాలకు అవధుల్లేవని నిరూపించారు. వయసుతో సంబంధం లేకుండా ఎంత చలాకీగా ఉన్నామో నిరూపించారీ స్టార్స్.