Oil Tanker : సముద్రంలో మునిగిన చమురు ఓడ.. 13 మంది భారత సిబ్బంది గల్లంతు
Oil Tanker : ఒమన్ సముద్ర తీరంలో చమురు ఓడ మునిగింది. ఈ ఘటనలో 13 మంది భారత సిబ్బంది గల్లంతయ్యారు. కొమొరోస్ జెండాతో వెళ్తున్న చమురు ఓడ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 16 మంది నౌక సిబ్బంది గల్లంతయ్యారు. వీరిలో 13 మంది భారత సిబ్బంది, ముగ్గురు శ్రీలంక వాసులు ఉన్నారు. మునిగిపోయిన ఓడను ప్రెస్టీజ్ ఫాల్కాన్ గా గుర్తించారు.
పోర్టు టౌన్ దుకమ్ కు సమీపంలోని రాస్ మద్రాకకు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఆ దేశ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ పేర్కొంది. ఆయిలో ట్యాంకర్ మునిగిపోవడానికి కారణాలు వెల్లడించలేదు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఓడలో 16 మంది సిబ్బంది ఉన్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపింది. ఓడ మునిగిపోయి తలకిందులైనట్లు తెలుస్తోంది. అయితే, సముద్రంలో చమురు లీకైందా.. లేదా..? అనే విషయాన్ని వెల్లడించలేదు.