Maruti Suzuki Wagon R : ఒకప్పుడు కార్లు విలాసవంత జీవితానికి ప్రతీక అనేవారు. కానీ కార్లు ఇప్పుడు కామన్ గా వాడుకునే వాహనం అయిపోయింది. దాదాపు ప్రతీ ఒక్కరికి కార్లంటే మక్కువ ఉంటుంది. అయితే దేశంలో అత్యంత ఎక్కువ మందికి మాత్రం ఈ కారంటే చాలా చాలా ఇష్టం. 24 ఏండ్లుగా అమ్మకాల్లో ఈ కారుదే అగ్రస్థానం. కారు పేరు చెబితే మీరు కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటారు లెండి..
మారుతీ సుజుకీ కార్లు భారతీయ మార్కెట్ లో ఎప్పుడూ టాప్ లోనే ఉంటాయి. ముఖ్యంగా బడ్జెట్ కార్ల విషయానికొస్తే ఈ కంపెనీ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. మారుతీ 800 తర్వాత, వ్యాగన్ ఆర్ కూడా భారతీయ మార్కెట్ లో బాగా ప్రాచుర్యం పొందింది. 1999లో రోడ్డుపైకి వచ్చిన ఈ కారును ఇప్పటికీ ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ తక్కువ బడ్జెట్ కారు అతిపెద్ద ప్రయోజనం మంచి మైలేజ్ ఇవ్వడం, తక్కువ మెయింటనెన్స్ ఖర్చు. వీటివల్లే సామాన్యుల నుంచి ఓ మోస్తారు ధనవంతుల వరకు దీన్నే ఇష్టపడుతున్నారు. అయితే మారుతి వ్యాగన్ ఆర్ అందరి మనస్సులను గెలుచుకోవడానికి ఓ ప్రత్యేకత ఉంది. అదెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మారుతీ వ్యాగన్ ఆర్ రూ.6-8 లక్షల బడ్జెట్ లో వస్తున్న కారు. ఇంత తక్కువ ధరకు వస్తున్నప్పటికీ ఐదుగురికి సరిపడా స్థలం ఉంటుంది. లెగ్ రూం, హెడ్ రూం బాగుంటాయి. బూట్ స్పేస్, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది. దీని కారణంగా వ్యాగన్ ఆర్ ను కంకర రోడ్లపై కూడా సులభంగా నడపవచ్చు. కారులో ప్రయాణికులు సౌకర్యవంతంగా ఉంటుంది. డ్రైవింగ్ సీటు కూడా అడ్జెస్ట్ బుల్ గా ఉంటుంది. దీనివల్ల దూరప్రయాణం చేసినా అలసిపోరు.
వ్యాగన్ ఆర్ ఫీచర్లు ఇలా..
-7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే
– 4- స్పీకర్ మ్యూజిక్ సిస్టం
– స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్
– స్మార్ట్ ఫోన్ నావిగేషన్
– డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్
-EBD తో కూడిన ABS
– వెనక పార్కింగ్ సెన్సార్
– హిల్ -హోల్డ్ అసిస్ట్(ఏఎంటీ వేరియంట్ లో మాత్రమే)
ఇంజిన్ పనితీరు ఇలా..
వ్యాగన్ ఆర్ బేస్ మోడల్ లో కంపెనీ 1.0 లీటర్ కె-సిరీస్ ఇంజిన్ ను అందిస్తోంది. అయితే టాప్ మోడల్ 1.2 లీటర్ ఇంజిన్ తో పరిచయం చేసింది. ఈ కారు 1.0 లీటర్ ఇంజిన్ లో సీఎన్జీ ఎంపికతో కూడా అందుబాటులో ఉంది. దీని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 88.5 bhp శక్తిని, 113ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
-పెట్రోల్ తో నడిపినప్పుడు 25 కిలోమీటర్లు, సీఎన్జీ తో నడుపుతున్నప్పుడు 33 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
అందుబాటులో ధరలు..
భారత మార్కెట్లో అత్యంత అందుబాటులో ఉండే ధరలో మారుతీ వ్యాగన్ ఆర్ ఒకటి. ఇది నాలుగు రకాల్లో LXi, VXi, ZXi, ZXi+ లలో విక్రయిస్తున్నారు. ఫ్యాక్టరీ అమర్చిన సీఎన్జీ కిట్ ఎంపిక దాని LXi, VXi ట్రీమ్ లలో కూడా అందుబాటులో ఉంది. భారత్ లో దీని ధర రూ.5.54లక్షల నుంచి రూ.7.42లక్షల (ఎక్స్-షోరూం) మధ్య ఉంది.