JAISW News Telugu

Hebah Patel : అబ్బబ్బ హెబ్బ చీరకట్టులో అందాల ఆరబోత.. చూస్తే మతిపోవాల్సిందే

FacebookXLinkedinWhatsapp
Hebah Patel

Hebah Patel

Hebah Patel : హెబ్బా పటేల్ ప్రస్తుతం ఓదెల 2 మూవీలో నటిస్తోంది. ఓదెల మూవీలో హిరోయిన్ గా చేసిన హెబ్బ ఓదెల 2 లో కీలక పాత్రలో నటిస్తుండగా.. ఈ మూవీలో తమన్న నటిస్తున్నట్లు సమాచారం. దాదాపు దశాబ్దం కిందట సినిమాల్లోకి వచ్చిన హెబ్బ పటేల్ టాలీవుడ్ ఇండస్ట్రీకి అలా ఎలా మూవీతో ఎంట్రీ ఇచ్చింది.

రెండో సినిమాలోనే డైరెక్టర్ సుకుమార్ కళ్లలో పడటంతో మంచి అవకాశం కొట్టేసింది. కుమారి 21 ఎఫ్ మూవీలో హిరోయిన్ గా అవకాశం రావడంతో తన తలరాతే మారిపోయింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో హెబ్బ పటేల్ వెనుదిరిగి చూసుకోలేదు. ఈ ఒక్క మూవీతోనే ఎన్నో అవకాశాలు సంపాదించుకుంది. సినిమాల మీద సినిమాలు చేసి దూసుకుపోయింది. కాస్త బోల్డ్ గా కనిపించే హెబ్బ కు ఫుల్ ఫ్యాన్స్ అయిపోయారు. రాజ్ తరుణ్ తోనే ఈడో రకం.. ఆడో రకం మూవీలో నటించగా.. ఆ మూవీ కూడా హిట్ అయింది. నిఖిల్ తో ఎక్కడికి పోతావ్ చిన్నవాడా.. లో చాలా పద్ధతిగా కనిపించింది.

అనంతరం హెబ్బ చేసిన మిస్టర్, అందగాడు,ఏంజిల్ , నేను నా బాయ్ ఫ్రెండ్ లాంటి మూవీలు నిరాశపరిచాయి. దీంతో హెబ్బ పటేల్ కు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో నటిగానే కాకుండా ఐటం సాంగ్స్ కూడా చేయడం మొదలెట్టింది. ఐటం సాంగ్స్ మూడు చేసింది. హిరో రామ్ తో డించక్, డించక్ డించా అనే ప్రత్యేక గీతంలో ఆడి పాడింది.

పలు వెబ్ సిరీస్ లో నటించిన హెబ్బ తాజాగా ఇన్ స్టాగ్రాంలో తన హాట్ హాట్ అందాలు ఒలకబోస్తూ నెట్టింట ఫోటోలతో రెచ్చగొడుతోంది. చీరకట్టులో  ఎద అందాలు కనిపించేలా కుర్రకారు మత్తెక్కించేలా ఫొటోలు పెడుతోంది. దీంతో హెబ్బ ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు.  ప్రస్తుతం హెబ్బ చేతిలో నాలుగు సినిమాలు ఉండగా.. ఒక సీక్వెల్ సినిమా కూడా చేస్తుంది.

Exit mobile version