little girl : అయ్యో చిన్నారి.. అన్ననే అలా చేశాడా..?

 little girl

little girl

little girl : సాంకేతికత పెరుగుందని ఆనందించాలో మనషిలోని విలువలను నాశనం చేస్తున్నాయని బాధపడాలో తెలియడం లేదు. అర్థం పర్థం లేదని సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్ చూసి పిల్లలు దారి తప్పుతున్నారు. ఏమైనా అందామా అంటే తెలియని తనం. చెప్పే బాధ్యత పెద్దలకు ఉన్నా పెద్దగా పట్టించుకోకపోవడం ఒక కారణం. బుద్ధి ఉన్న తండ్రులు, లేదా పక్కింటి అంకుళ్లు రేప్ చేశారంటే కామంతో కొవ్వు బట్టి చేశారనుకోవచ్చు. కానీ వరుసకు అన్న, తనకంటే మూడేళ్ల పెద్ద వాడు తనపై లైంగిక దాడి చేస్తున్నాడని పాపం ఆ చిన్నారికి తెలియదా..? లేక ఇది లైంగిక దాడి అని ఆ సోదరి అన్నకు తెలియదా.. ఏది ఏమైనా ఈ ఘటన మాత్రం తీవ్రంగా కలిచి వేస్తుంది.

గుజారాత్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో ఇద్దరు పిల్లలతో తల్లిదండ్రులు నివసిస్తున్నారు. ఇటీవల వారి 13 ఏళ్ల చిన్నారి కడుపునొప్పి అని ఏడవడం మొదలుపెట్టింది. తల్లిదండ్రలుు హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ వారు షాక్ అయ్యారు. చిన్నారి అప్పటికే 20 వారాల గర్ఛంతో ఉందని చెప్పారు. షాక్ తిన్న వారు కారణం గురించి ఆరా తీయగా తన అన్ననే తనపై లైంగికదాడి చేసినట్లు చెప్పింది. తల్లిదండ్రులు పని నిమిత్తం వేరే గ్రామం వెళ్లేవారు. చిన్నారు స్కూల్ ముగించుకొని 2 గంటలకు ఇంటికి వచ్చేంది. తనకంటే మూడేళ్ల పెద్దవాడైన తన అన్న స్కూల్ మానేసి పని చేస్తున్నాడు. అతను తెల్లవారు జామున పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చేవాడు. అయితే అతడు టీవీలో క్రైమ్ ఆంథాలజీ సీరియల్స్ చూసేవాడు. అందులో లైంగిక సన్నివేశాలకు అట్రాక్ట్ అయ్యి సోదరిపై లైంగికదాడి చేశాడు. ఈ ఘటనతో పోలీసుల బాలుడిపై BNS & పోక్సో కేసు నమోదు చేశారు. కూతురు కొడుకు పరిస్థితి చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

TAGS