OG-Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. దీన్ని రెండు పార్టులుగా తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
‘దేవర’ పార్ట్ 1 షూటింగ్ కొనసాగుతోంది. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించుకోవడంతో పాటు షూటింగ్ కొనసాగించేందుకు చిత్ర బృందం గోవా వెళ్లింది. అక్కడ కొన్ని సీన్స్, ఒక సాంగ్ కూడా షూట్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఇప్పటికే ప్రిన్సిపుల్ చిత్రీకరణ పూర్తయింది.
దేవరతో పాటు బాలీవుడ్ లో కూడ సినిమా ‘వార్ 2’లో కూడా నటిస్తున్నారు యంగ్ టైగర్. అది కూడా పూర్తయ్యింది. ఇక దేవరకు ఫుల్ కాల్ షీట్లు ఇస్తున్నాడు. ఇంకా షూటింగ్ పూర్తి కలేదు. దీంతో ‘దేవర1’ విడుదల తేదీని వాయిదా వేసే ఆలోచనలో దర్శక, నిర్మాతలు ఉన్నట్లు టాలీవుడ్ సర్కిల్ లో గాసిప్ నెలకొంది. ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిర్మాతలు కొత్త రిలీజ్ డేట్ ను ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అది సెప్టెంబర్ 27, 2024ను. గతంలో ఈ తేదీని పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ కోసం రిజర్వ్ చేశారు.
అయితే ఏపీలో ఎన్నికలు, పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారంలో పాల్గొనడం, ఇతర కారణాల వల్ల నిర్మాత డీవీవీ దానయ్య ఈ ప్రాజెక్ట్ సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు సిద్ధం కాకపోవచ్చని గ్రహించారు. దీంతో ఎన్నికలు ముగిశాక ‘ఓజీ’కి కొత్త తేదీ ప్రకటిస్తారని తెలుస్తోంది.
దీంతో ‘దేవర’ టీం సమయాన్ని వృథా చేయకుండా షూటింగ్ ను మరింత వేగంగా కొనసాగించి ‘ఓజీ’ కోసం కేటాయించిన తేదీని చేజిక్కించుకోవాలని భావిస్తోంది.