Tadepalli Road : తాడేపల్లి రోడ్డును తెరిచిన అధికారులు.. టూరిస్ట్ ప్లేస్ గా భావిస్తున్న ప్రజలు
Tadepalli Road : గుంటూరులోని తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటికి వెళ్లే రహదారిని ఐదేళ్ల తర్వాత మళ్లీ ప్రజల వినియోగానికి తెరిచారు.
ఐదేళ్ల తర్వాత తొలిసారిగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లే రహదారిని సోమవారం (జూన్ 17) ప్రజల వినియోగానికి తెరిచారు.
ఐదేళ్లుగా ఇంటిని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకున్న జగన్ కు భద్రత కల్పించాలనే కారణంతో రోడ్డును మూసేశారు. నిజానికి ఆయన సెక్రటేరియట్లో కాకుండా ఈ క్యాంపు కార్యాలయం నుంచే ఎక్కువ సమీక్షలు నిర్వహించారు. కేబినెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు మినహా ఆయన సచివాలయం, అసెంబ్లీకి వెళ్లలేదు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఈ నివాసంలోనే ఆయనను అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ కేడర్ తదితరులు కలుస్తుండడంతో పోలీసులు ప్రజలను ఈ రోడ్డుపైకి రానివ్వలేదు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనధికార ఇళ్లను తొలగించి రోడ్డును అభివృద్ధి చేశారు.
శ్రీ జగన్ నివాసం తాడేపల్లి నుంచి రేవేంద్రపాడు వెళ్లే రహదారిలో దాదాపు 1.5 కి.మీ. బారికేడ్లను తొలగించడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. జగన్ ఇల్లు ను చూస్తున్న ప్రజలు అదేదో విజిటింగ్ ప్లేస్ ను చూస్తున్నట్లు ఫీల్ అవుతున్నారు. సాయంత్రం ఆ రోడ్డుపై నుంచి వెళ్లాలంటే ఇంట్రస్ట్ చూపుతున్నారు. కేవలం జగన్ నివాసమే కాదు.. రోడ్డంతా కూడా లైట్లతో దేదీప్యమానంగా వెలిగి పోతుంది. అందుకే అంటు వైపు ప్రజలు వెళ్తూ ఏదో టూరిస్ట్ ప్లేస్ గాచూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.