SIT Case Documents : ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అవినీతి, అక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. తన ఇష్టానుసారంగా ప్రవర్తించి అనేక పొరపాట్లు చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. సీఐడీ, సిట్ ఆఫీసుల నిర్వాకంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును జైలులో పెట్టి తన పైశాచికానందాన్ని పొందారు. అందుకు సంబంధించిన పత్రాలను అధికారులు తగలబెట్టడం చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ నేతలపై పెట్టిన కేసులు కనబడకుండా పోవాలనే ఉద్దేశంతో పత్రాలను తగులబెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆఫీసు వారే మీడియాకు లీక్ చేశారు. వాటి అవశేషాలు బయటపడకుండా జాగ్రత్త పడేందుకు ఇలా చేసినట్లు తెలుస్తోంది. టెక్నికల్ గా ఎవరికి అనుమానం రాకుండా ఉండాలనే ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు.
సిట్ ఆఫీసులో ఉన్న పత్రాలన్నింటిని , టీడీపీ నేతలపై ఉన్న కేసులకు సంబంధించిన పత్రాలను, అక్రమంగా సంపాదించిన పత్రాలకు నిప్పు పెట్టేశారు. పత్రాలు కాలుస్తుంటే ఆఫీసు వారే వీడియో తీసి మీడియాకు పంపడం జరిగింది. టీడీపీ మాత్రం పత్రాలు కనబడకుండా చేయాలనే ప్రభుత్వం ఇలాంటి దురాగాతాలకు పాల్పడుతోందని విమర్శించింది.
ఏపీలో జగన్ అక్రమ పాలనతో అందరు బేజారయ్యారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబును సైతం ఎలాంటి ఆధారాలు లేకున్నా జైలులో పెట్టి తన ఇగో చూపించుకున్నారు. తప్పుడు కేసులు పెట్టి దాదాపు 60 రోజులు జైలులో ఉంచి రాక్షసానందాన్ని పొందిన విషయం తెలిసిందే. ఇలా జగన్ దురాగాతాలకు లెక్క లేకుండా పోయింది. ప్రస్తుతం అతడి పాలనకు చరమగీతం పాడాలని ప్రజలు చూస్తున్నారు.
సాక్ష్యాధారాలను ఇలా ధ్వంసం చేసి బయటపడాలని చూస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే జగన్ మామూలుగా ఉండదు. దెబ్బకు దెబ్బ తీసేందుకు రెడీగా ఉంటారని చెబుతున్నారు. అదే జరిగితే రాజకీయాల్లో ఇంకా మార్పులు జరిగే అవకాశాలుంటాయి. వచ్చే ఎన్నికలు ఏం తేలుస్తాయో తెలియడం లేదని పలువురు చెబుతున్నారు.