World Cup Effect on Pakistan : కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు. పాకిస్తాన్ ఓటమికి కూడా ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. వరల్డ్ కప్ లో చెత్త ప్రదర్శనతో లీగ్ దశలోనే నిష్క్రమించింది. దీంతో పాక్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పాక్ కొట్టుమిట్టాడుతోంది. పాకిస్తాన్ తీరు పట్ల దేశమంతా విమర్శలే ఎదురవుతున్నాయి.
కెప్టెన్ బాబర్ అజంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వరల్డ్ కప్ లో ఇంత చెత్త ఆట ఎప్పుడు ఆడలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈనేపథ్యంలో తమ పదవులకు రాజీనామాలు చేయడానికి ముందుకొస్తున్నారు. బౌలింగ్ కోచ్ పదవికి మోర్నే మోర్కెల్ రాజీనామా చేశాడు. ఇంకా అదే బాటలో కొందరు ఉన్నట్లు సమాచారం. టీం సెలెక్టర్ పదవికి కూడా రాజీనామా చేశారు.
బాబర్ అజం తన కెప్టెన్సీని వదులుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ కు అన్ని వైపుల విమర్శల దాడి పెరుగుతోంది. వరల్డ్ కప్ రాకుండా చేయడంలో మన ఆటగాళ్లే ప్రధాన కారణమని తిట్టిపోస్తున్నారు. మోర్నే మోర్కెల్ గత జూన్ లోనే బౌలింగ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించినా సరైన ప్రదర్శన చూపలేదనే కారణంతో తన పదవిని వదులుకున్నారు.
పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లలో ఎవరు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రదర్శన చూపలేదు. దీంతో ప్రత్యర్థి జట్లకు లాభాలు దక్కాయి. అవి విజయం సాధించి ఊపు మీద కనిపించాయి. మన వారు మాత్రం నీరసపడిపోయారు. అలా వరల్డ్ కప్ ను దక్కకుండా చేసిన ఆటగాళ్లపై తిట్ల దండకాలు పెరుగుతున్నాయి. ప్రేక్షకులు తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు.