KCR : కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. బీఆర్ఎస్ లో కలకలం

KCR

KCR

KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండడంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. ఎర్రని బట్టలు, బొమ్మ, పసుపు కుంకుమ, వెంట్రుకలు, నిమ్మకాయలు ఉండడంతో భయానకమైన పరిస్థితి కనిపిస్తోంది. అర్ధరాత్రి ఈ క్షుద్రపూజలు చేసినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు.

కేసీఆర్ ఇంటి పక్కనే ఈ  క్షుద్రపూజలు జరగడం చర్చనీయాంశమైంది. క్షుద్రపూజలను ఎవరు చేశారు? ఎవరిని టార్గెట్ చేసేందుకు ఈ పూజలు చేశారు? దీని వెనక ఎవరున్నారు? రాజకీయ దురుద్దేశంతోనే ఈ క్షుద్రపూజలు చేశారా? అనే విషయాలపై చర్చ జోరుగా సాగుతోంది. కేసీఆర్ ఫ్యామిలీని ఆందోళనకు గురిచేసేందుకే ఈ ప్లాన్ చేశారా? అనే అనుమానాలను బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ సెంటిమెంట్లను ఎక్కువగానే నమ్ముతారు. ఈ కారణంగానే ఆయన్ను మరింత ఒత్తిడిలోకి నెట్టేందుకు ఇలాంటి వాటికి తెరతీశారా? అనే కోణంలో చర్చలు సాగుతున్నాయి. అయితే ఈ క్షుద్రపూజలపై ఇప్పటివరకు కేసీఆర్ ఫ్యామిలీ స్పందించలేదు. కానీ బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఆందోళన చెందుతున్నాయి.

వాస్తవానికి కేసీఆర్ టైం బాగోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొడుదామనుకుంటే ఏ అంచనా లేని కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. నిరుద్యోగులను, ఉద్యోగులను తక్కువ అంచనా వేయడమే కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధాన కారణం. ఇక ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయడంతో బీఆర్ఎస్ కు గడ్డు కాలం మొదలైంది. త్వరలోనే ఎంపీ ఎన్నికలు ఉండడం.. కీలక నేతలు పార్టీని వీడుతుండడంతో గత 23 ఏండ్లలో బీఆర్ఎస్ ఎన్నడూ చూడని సంక్షోభాన్ని చవిచూస్తోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయాలని చూస్తున్నాయి. ఇలాంటి సమయంలో సెంటిమెంట్లను బాగా నమ్మే కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు జరుగడం గమనార్హం. మరి వీటిని తేలిగ్గా కొట్టిపారేస్తారా? పరిహారాలు ఏమైనా చేయిస్తారా? చూడాలి.

TAGS