Kamalaharis : కమలాహారిస్ కు ఒబామా దంపతుల మద్దతు

Kamalaharis
Kamalaharis : అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న కమలాహారిస్ కు ఒబామా దంపతులు మద్దతు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగడంతో ఆ స్థానంలో భారత సంతతి అమెరికన్ కమలాహారిస్ పేరు దాదాపు ఖరారైనట్లే. పార్టీలో మెజారిటీ ప్రతినిధులు, నేతలు ఆమెకు మద్ధతు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామా నుంచి ఆమెకు మద్దతు వ్యక్తమైంది. దానికి సంబంధించిన వీడియోను వారిద్దరూ తమ ఎక్స్ ఖాతాల్లో షేర్ చేశారు. వారికి వెంటనే హారిస్ కృతజ్ఞతలు తెలియజేశారు.
బైడెన్ వైదొలగడంతో ఆయన స్థానంలోకి వచ్చిన కమలాహారిస్ కు డెమోక్రటిక్ పార్టీ సభ్యుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. దాంతో ఆయన మద్దతు ఆమె ఫండ్ రైజింగ్ కార్యక్రమాలకు సహాయపడనుంది. అలాగే అధికారికంగా అధ్యక్ష అభ్యర్థిగా ఆమెను ప్రకటించిన తర్వాత ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనే అవకాశాలున్నాయి.