School Fees : ఓ స్కూల్ లో నర్సరీ ఫీజు రూ. 1,20,000
School Fees : తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని వారికి మంచి విద్యను అందించాలని భావిస్తుంటారు. మంచి విద్యను పిల్లలకు అందించడానికి స్థిర, చరాస్తులను అమ్మి అయినా డబ్బులను ఖర్చు చేస్తుంటారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రుల బలహీనతను కొన్ని ప్రైవేట్ విద్యాసంంస్థలు డబ్బులను దోచుకుంటున్నాయి. హైదరాబాద్ లోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల ధరలు తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. ఓ స్కూల్ లో నర్సరీ ఫీజు ఏకంగా రూ. 1,20,000 లు ఉంది. దీంతో తల్లిదండ్రుల గుండెలు బాదుకుంటున్నారు.
హైదరాబాద్ గండిపేటలోని ‘సత్యా అకాడమీ’లో నర్సరీ ఫీజు ఏడాదికి రూ.1.20 లక్షలని, గత ఏడాది కంటే ఈసారి 50% ఫీజు పెంచారని ఓ తండ్రి ఆవేదన వ్యక్తవ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా మార్చిలో ఫీజు పెంచడంతో తక్కువ సమయం ఉండడంతో స్కూల్ మార్చడం కష్టమవుతోందని తెలిపారు.