NTR : తెలుగువారి ఆ్మగౌరవం కోసం తపించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్..
- ప్రజల గుండెల్లో నిలిచిన ఈ రోజు ప్రత్యేకత ఏంటో తెలుసా..
NTR : ఒక గొప్ప నటుడు గా ప్రజానాయకుడు గా తెలుగువారు మనసులో నిలిచిపోన ఏకైక వ్యక్తి ఎన్.టి.రామారావు..తెలుగు వారు అంతా “అన్న గారు” అని పిలుచుకుంటారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించి యుగపురషుడు గా నిలిచారు. నంద మూరి తారక రామారావు 1983 జనవరి 9వ తారీకున తొలిసారి సీఎం కుర్చీని అధిష్టించారు. ఎన్టీఆర్ సీఎం కుర్చీ ఎక్కి నేటికి 41 సంవత్సరాలు పూర్తి అయిన సంద్భంగా ఆ మహానుభా వుడిని ఒక్కసారి స్మరించుకుందాం..
రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రా ధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని ఎన్టీఆర్ కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా 7 సంవ త్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచాడు.
1978 లో ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారానికి వచ్చిన కాంగ్రేసు పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలయ్యింది. తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. ఐదు సంవత్సరాల కాలంలో నలు గురు ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి, రాష్ట్రంలో శాసనసభ్యులచేత నామకార్థం ఎన్నిక చేయించేవారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రదిష్ట పాలయింది.
రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ పాలన కు చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో 1982 మార్చి 29 సాయంత్ర ము 2:30లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు ఎన్టీఆర్ తన అభిమానులకు చెప్పాడు. ఆసమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి, ప్రకటించాడు. పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెటు వ్యానును బాగు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయిం చాడు. దానిపై నుండే అతను తన ప్రసంగాలు చేసేవాడు. దానిని అతను “చైతన్యరథం” అని అన్నాడు. ఆ రథంపై “తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!” అనే నినాదం రాయించాడు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్యరథమే స్ఫూర్తి.