NTR Grandson : ఆమె మా కుటుంబానికి శని.. లక్ష్మీ పార్వతిపై విరుచుకుపడిన ఎన్టీఆర్ మనవడు!
NTR Grandson Chaitanya : సీనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతిపై ఎన్టీఆర్ గారి మనవడు చైతన్య కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు ఆ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.. నందమూరి ఫ్యామిలీలో చాలా మంది లక్ష్మి పార్వతిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం తెలుగు ప్రజలకు బాగా తెలుసు..
నందమూరి కృష్ణ చైతన్య ఇప్పుడు డైరెక్ట్ గానే ఈమెపై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ తనయుడు నందమూరి చైతన్య కృష్ణ గతంలో రెండు దశాబ్దాల క్రితమే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు.. కానీ ఈయన మాత్రం సక్సెస్ అవ్వలేక పోయాడు..
ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు.. బ్రీత్ అనే మూవీతో డిసెంబర్ 2న రాబోతున్నాడు. దీంతో ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇతడు లక్ష్మి పార్వతిపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యింది.
రాజకీయాలపై సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.. చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు అనే వ్యాఖ్యలపై కూడా ఇతడు తనదైన శైలిలో జవాబు చెప్పాడు.. లక్ష్మి పార్వతి గురించి చెబుతూ అనొద్దు కానీ ఆమె మా కుటుంబంలో అడుగు పెట్టడం వల్ల మాకు ఏ మాత్రం మంచి జరగలేదు..
మా ఫ్యామిలీలో ప్రతీ విషయంలో జోక్యం చేసుకునేది.. పార్టీని లాగేసుకోవాలనే చెడు ఉద్దేశం కూడా ఉండేది.. డైరెక్ట్ గా ఇప్పుడు చెబుతున్న ఆమె మా ఫ్యామిలీకి శనిలా పట్టింది.. చాలా మంది చంద్రబాబు మామయ్య మీద కామెంట్స్ చేస్తున్నారు.. కానీ అది నిజం కాదు..
చంద్రబాబు పార్టీని కాపాడడం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాడు.. అప్పుడు బాలకృష్ణ, హరికృష్ణ చంద్రబాబు వైపు ఉన్నారు.. కానీ మా నాన్న గారు తప్పక తాత వైపు ఉన్నారు. లక్ష్మి పార్వతి అంటే మా నాన్నకు కూడా ఇష్టం ఉండేది కాదు.. ఆమె ఒక క్యారెక్టర్ లెస్ లేడీ.. అంటూ ఈమెపై చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..