Devara Trailer : సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ట్రైలర్ మంగళవారం విడుదల చేశారు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రూపొందిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం దేవర. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గత మూడేళ్ల నుంచి ఎన్టీఆర్ దేవర మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
మరి ఆయన ఈ సినిమాను చేయడం లో గల ముఖ్య కారణం ఏంటంటే కొరటాల ఇంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ కి ‘జనతా గ్యారేజ్’ అనే ఒక సూపర్ డూపర్ సక్సెస్ ఫుల్ సినిమాని అందించాడు. అందుకే తనకు మరో సారి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చారు. ఇక కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెట్టాడా లేదా అనే విషయాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే కొద్దిసేపటికి క్రితం రిలీజ్ అయింది. ఇక ఈ ట్రైలర్ ని కనక చూసినట్లయితే ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమాగా మాత్రం ఇది కనిపించడం లేదు.
ఎందుకంటే ఈ సినిమా మీద ఎన్టీఆర్ కి మొదటి నుంచి నమ్మకం లేనట్లుగా తెలుస్తుంది. అందుకే తను ఈ సినిమాను చేస్తున్నామా అంటే చేస్తున్నాం అన్నట్టుగా చేశాడు తప్ప భారీ సక్సెస్ అందుకుంటుందనే ఉద్దేశంలో అయితే ఎన్టీఆర్ లేనట్టుగా తెలుస్తుంది. అందుకోసమే నెక్స్ట్ వెంటనే ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమాని సెట్ చేసుకున్నాడు. ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే ఎన్టీఆర్ పేరు పాన్ ఇండియా లో మారు మ్రోగుతుందని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం పరిస్థితి అలా కనిపించడం లేదు. ఇక ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ ను నమ్ముకోవడమే బెటర్ అని అతనితో పట్టుబట్టి మరి సినిమాని సెట్ చేసుకున్నట్లు అర్థం తెలుస్తుంది.
మరి కొరటాల శివ ఎందుకు ఇలాంటి ఒక నాసిరకం కథతో సినిమా చేస్తున్నాడనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇక దేవర ట్రైలర్ చూస్తే సినిమాలో దమ్ము ఉన్నట్లు అయితే కనిపించడం లేదు. స్టోరీని ఎస్టాబ్లిష్ చేసిన విధానం అయితే బాగోలేదని సినీ విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. సినిమా స్టోరీని రొటీన్ గా రాసుకొని బ్యాక్ డ్రాప్ ను మాత్రం కొత్తగా ఎంచుకుని సినిమాని ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటే అది చాలా వరకు వర్కౌట్ కాదన్న వ్యవహారం కొరటాల ఆచార్య ప్రూవ్ చేసింది కూడా. కొరటాల మళ్ళీ అదే సెటప్ ని తీసుకొని సక్సెస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ స్టార్ హీరో లతో ఇలాంటి ప్రయోగాలు చేయడం అనేది చాలా వరకు తప్పు… ఎందుకంటే అతని అభిమానులను సాటిస్ఫై చేయడంలో ఇలాంటి ఎక్స్పరమెంట్లు చాలా వరకు బెడిసి కొడతాయనే చెప్పుకోవాలి.