NSE App : ఎన్ఎస్ఈ యాప్ ను తాజాగా లాంచ్ చేసింది. తన వెబ్ జైల్ లను తెలుగు సహా 11 భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు కేవలం ఆంగ్లంలోనే అందుబాటులో ఉన్న వెబ్ సైట్ సేవల్ని మరిన్ని భాషలకు విస్తరించింది. తెలుగుతో పాటు 11 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తెచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్ సైట్ లో తెలుగుతో పాటు అస్సాం, బెంగాలీ, కన్నడ, మలయాళం, ఒడియా, పంజాబీ, తమిళం, హిందీ, మరాఠీ, గుజరాత్ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. దీంతో మదుపరులు సులభంగా డేటాను యాక్సెస్ చేసే సదుపాయం లభించింది.
ఎన్ఎస్ఈ మొబైల్ అప్లికేషన్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు యాక్సెస్ చేయొచ్చు. పెట్టుబడిదారులు సురక్షితమైన సమాచారాన్ని యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఇందులోనే ఇండెక్స్ ఓవర్ వ్యూలు, మార్కెట్ అప్ డేట్లు, ట్రేడింగ్ వాల్యూమ్ లు, నిఫ్టీ-50 పర్ ఫార్మెన్స్ ఇండికేటర్లు, స్టాక్ సెర్చ్ క్యాపబిలిటీస్, కస్టమైజ్డ్ వాచ్ లిస్ట్స్, ఇలా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు ఆప్షన్ ట్రేడింగ్ కు సంబంధించిన కాల్స్, పుట్స్ లాంటి మొత్తం డేటా ఉంటుందని ఎన్ఎస్ఈ తెలిపింది.