JAISW News Telugu

Nritya Darpan-2024 : న్యూజెర్సీలో ఈనెల 25న నృత్య దర్పణ్-2024.. అద్భుత కళోత్సవానికి ఆహ్వానం

Nritya Darpan-2024

Nritya Darpan-2024, New Jersey

Nritya Darpan-2024 : భారతీయ సంస్కృతిలో కళలకు అత్యంత ప్రాధాన్యముంది. వేల సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా భారతీయ గొప్పతనాన్ని చాటుతున్నాయి. ఇప్పటికీ భారతీయులు తమ సంప్రదాయాలను, కళలను ఆచరిస్తూ మహోన్నత వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. భారత్ లో పుట్టి  విదేశాలకు వెళ్లిన అక్కడ సైతం భారతీయ మూలాలను మరిచిపోకుండా మన కళలను ప్రచారం చేయడమే కాకుండా అక్కడి వారికి పరిచయం చేస్తున్నారు.

ఈనెల 25న అమెరికాలోని న్యూజెర్సీలో నృత్య దర్పణ్-2024 పేరిట అద్భుత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  ఇండియన్ హెరిటేజ్ కల్చరల్ అసొసియేషన్, న్యూజెర్సీ మరియు ది  కన్సల్టెట్ జనరల్ ఆఫ్ ఇండియా, న్యూయార్క్ ఆధ్వర్యంలో ఈ గొప్ప వేడుక జరుగనుంది. న్యూ బ్రన్ శ్విక్ పర్ ఫర్మెన్స్ ఆర్ట్ సెంటర్(NBPAC),  11 లివింగ్ స్టన్, AVE, iiXXM, న్యూజెర్సీ లో ఈ వేడుక శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 9 వరకు నిర్వహించనున్నారు.

శాస్త్రీయ భారతీయ, సమకాలీన పాశ్చాత్య నృత్య రూపాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేందుకు నిర్వహించబోతున్న  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి  స్పాన్సర్స్ గా ది ఇండియన్ ఐ(న్యూస్ వీక్లీ), రేడియో జిందగీ, కేజీఈ, ఎన్డీటీవీ, సినీ వ్యూస్, మన ఇంటర్నేషనల్ టీవీ, టీవీ ఏసియా, ఐటీవీ గోల్డ్, పారిఖ్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ పార్టనర్ డిజిటాజ్ ఉన్నాయి. ఔత్సాహికులు ఈ కార్యక్రమానికి రావడానికి టికెట్లు బుక్ కొనుగోలు చేయడానికి https://secure.nbpac.org/nrityadarpan24 వెబ్ సైట్ లో సంప్రదించాలని సూచించారు.

Exit mobile version