JAISW News Telugu

Minister Kondapally : ఏపీ ఎన్నార్టీలపై ఎన్నారైలకు మరింత అవగాహన కల్పించాలి: మంత్రి కొండపల్లి

Minister Kondapally

Minister Kondapally

Minister Kondapally : ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుబంధ సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత, అభివృద్ధి కొరకు వివిధ సేవలను అందిస్తోంది. ప్రవాసాంధ్ర భరోసా బీమా, ఉచిత అంబులెన్సు సౌకర్యం, ఎక్స్-గ్రేషియా, ఆమ్నెస్టీ కింద వలస కార్మికులను రాష్ట్రానికి తీసుకురావడం, ప్రవాసాంధ్రుల భౌతికకాయాలను స్వగ్రామాలకు తరలింపులో సహాయం, పెట్టుబడులపై సలహాలు, కనెక్ట్ టు ఆంధ్రా, ఐటి శిక్షణలు, అంతర్జాతీయ నైపుణ్య శిక్షణలు, కెరీర్ కౌన్సెలింగ్ (విద్యావాహిని), అత్యవసరంగా స్వదేశానికి తిరిగి రావడంలో సహకారం, ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ఆలయ దర్శనాలు లాంటి అనేక సేవలను అందిస్తోంది.

ఈ నేపథ్యంలో ఎన్నారైలతో సత్సంబంధాలు, ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ కార్యచరణపై చిన్న పరిశ్రమలు, ఎన్నారై సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఏపీలోని ఏపీ ఎన్నార్టీ సొసైటీ కార్యాలయంలో ఆయన వర్చువల్ రివ్యూ నిర్వహించారు. తెలుగు ఎన్నారైల కోసం విదేశాలలో చేపడుతున్న కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ వివరాలను మంత్రి ‘కొండపల్లి శ్రీనివాస్’ కు జీఏడీ(పొలిటికల్) ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ ఎస్.సురేష్ కుమార్, ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సీఈవో పి.హేమలతా రాణి వివరించారు. ఎన్నారైల కోసం 24/7 హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రికి అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఏపీతో ఎన్నారైలు నిత్యం సంబంధాలు కలిగి ఉండేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కొన్ని అమూల్యమైన సలహాలను మంత్రి అధికారులకు సూచించారు. ఏపీఎన్నార్టీల గురించి విదేశాల్లోని ఎన్నారైలకు మరింత అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని, వారు వినియోగించుకోగలిగిన సేవల గురించి వారికి తెలియపరిచేలా ప్రమోషన్లు చేపట్టాలన్నారు. విదేశాల నుంచి బహిష్కరించిన ఎన్నారైలకు మరింత లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రచించాలన్నారు.

Exit mobile version