NRIs for Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని ఎన్ఆర్ఐలు ప్రయత్నిస్తున్నారు. 1,500 మంది ఎన్ఆర్ఐలు 125 దేశాల నుంచి తమ స్వస్థలాలకు చేరుకుని ప్రచారం చేయాలని సంకల్పించారు. చంద్రబాబు సీఎం అయితే రాష్ట్ర రూపురేఖలు మారతాయని ఆశిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఎన్ రీచ్ ఏపీ మీట్ నిర్వహించారు.
ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం అధ్యక్షుడు వేమూరి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానకి గల్ఫ్ ప్రాంత కమిటీ అధ్యక్షుడు రవిరాధాక్రిష్ణ అధ్యక్షత వహించారు. జగన్ ప్రభుత్వానికి చరమ గీతం పాడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. చంద్రబాబును మళ్లీ సీఎంను చేయడమే తమ ముందున్న లక్ష్యంగా భావిస్తున్నారు. దీని కోసం శ్రమించాలని పిలుపునిస్తున్నారు.
ఎన్డీయే అభ్యర్థుల విజయం కోసం పాటుపడాలని నిర్ణయించారు. జగన్ పాలనలో ప్రైవేటు ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటిష్ నాటి పాలన కన్నా నియంత రీతిలో దోపిడీ పాలన సాగిస్తున్న జగన్ ను ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ పరిస్థితి మారాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని ఆశిస్తున్నారు.
చంద్రబాబు హయాంలోనే పాలన సజావుగా సాగిందని అభిప్రాయపడ్డారు. జగన్ పాలనలో ఆస్తుల విలువలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చంద్రబాబు మళ్లీ అధికారం చేపట్టాలని ఎన్ఆర్ఐ విభాగం శ్రమిస్తుందని తెలిపారు. ఎన్నికల యుద్ధంలో నిలబడి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఐలు సమర్థంగా పనిచేసి బాబుకు బ్రహ్మరథం పట్టాలని సూచించారు.
ఎన్ఆర్ఐలు అవిశ్రాంతంగా శ్రమించి బాబు విజయం కోసం బాటలు వేయాలని కోరారు. ఎన్నికలకు తక్కువ కాలం ఉండటంతో ఒక బూత్, క్లస్టర్ ఎంచుకుని మంచి ఫలితాలు వచ్చేలా కష్టపడాలని చెబుతున్నారు. చంద్రబాబు విజన్ తోనే హైదరాబాద్ ఇరవై ఏళ్లలోనే డెవలప్ అయిందని గుర్తు చేశారు. అదే దారిలో ఏపీ కూడా ముందుకు వెళ్లాలంటే చంద్రబాబు అవసరం ఉందన్నారు.