NRIs Campaign : బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం కోసం ఎన్ఆర్ఐలు
NRIs campaign for BRS : తెలంగాణలో అధికారం కోసం బీఆర్ఎస్ ప్రచారం హోరెత్తిస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తాకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలనకు ప్రజలు ముగ్దులవుతున్నారని వెల్లడించారు. ప్రచారంలో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ సాధనలో కేసీఆర్ చూపిన తెగువతోనే ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరిస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా మూడోమారు ఎన్నికవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాు. 52 దేశాలకు చెందిన ఎన్ఆర్ఐలు ప్రచారం చేస్తున్నారన్నారు. నిజామాబాద్ నగరంలో 2014, 2018 ఎన్నికల్లో తాము ప్రచారం చేశామని గుర్తు చేసుకున్నారు. ఎవరు చేయలేని పనులు చేసిన కేసీఆర్ మరోసారి సీఎం కావడం తథ్యం.
తొమ్మిదేళ్లలో అంతర్గత కాలువల నిర్మాణం, వైకుంఠధామాలు, కలెక్టర్ భవనం నిర్మించారు. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు. నిజామాబాద్ ను డెవలప్ చేయడంలో కేసీఆర్ పాత్ర ఎంతో ఉందని తెలిపారు. ప్రణాళికాబద్ధంగా పని చేస్తూ నగరాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రైతు బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది.
దళిత బంధు కూడా ఎస్సీల్లో మంచి పారిశ్రామికంగా ఎదిగేందుకు దోహదం చేస్తోంది. అందుకే రాష్ట్రమంతా విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, 24 గంటల కరెంటు తదితర పనులతో దేశంలోనే ఆదర్శవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దారు. ప్రజలు బీఆర్ఎస్ కే బ్రహ్మరథం పడతారని తేల్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేయడం ఖాయమని జోస్యం చెప్పారు. సమావేశంలో చందు తల్లా, అశోక్, నవీన్, శ్రీనివాస్ జక్కిరెడ్డి, సతీష్, అహ్మద్, బిందు తదితరులు పాల్గొన్నారు.