NRI Voters : ఓట్ల కోసం ఎన్నారైలు వచ్చేస్తున్నారు.
NRI Voters : దేశంలో ఎన్నికల పండుగ మొదలైనది. భారత దేశం పరిపాలన పగ్గాలు ముచ్చటగా మూడోసారి చేపట్టాలని భారతీయ జనతా పార్టీ ఉవ్విళ్ళు ఊరుతోంది. 400 పార్లమెంట్ స్థానాల్లో విజయపతాకాన్ని ఎగురవేయాలని ప్రతిపక్షాలకు దీటుగా బిజెపి ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది.ఇండియా కూటమి కూడా బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకోడానికి ఠానాడైనా శైలిలో విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.దేశంలో ఉన్న ఓటర్లను ఆకట్టుకోడానికి ఇండియా కూటమి తోపాటు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో కూడా విడుదల చేసాయి. మేనిఫెస్టో తోపాటు స్థానిక అవసరాలను గుర్తించిన కూటమిలోని పార్టీలు కూడా హామీలను గుప్పిస్తున్నాయి.దేశంలోనే ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిపోయిన వారిని గుర్తించే పనిలో పడ్డారు పార్టీ అభ్యర్థుల సహచరులు.పోలింగ్ రోజు ఉపాధి కోసం వెళ్లిన వారు ఎక్కడ ఉన్నా సరే ప్రత్యేక ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాదు వాళ్లకు ఉన్నన్ని రోజులు వసతి,భోజనం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.ఓటు విలువ తెలియడంతో దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను తీసుకు రావడానికి అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడటంలేదు. ఎంత ఖర్చు అయినా సరే మన పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలో ఉన్న ఓటర్లు ఎక్కడ ఉన్నప్పటికిని తీసుకు రండి అంటూ అభ్యర్థులు వాళ్ళ అనుచరులను వేగిలపరచడంతో నాయకులు పరుగెత్తక తప్పడంలేదు.
ఈ నేపథ్యంలో భారత దేశం దాటి ఇతర దేశాల్లో స్థిరపడిన వారిని గుర్తించే పనిలో పడ్డారు పార్లమెంట్ కు పోటీచేస్తున్న అభర్ధులు. గెలువడానికి అవసరమయిన ఓట్లు ఎన్ని, గతంలో ఎన్ని ఓట్లు ఎక్కడెక్కడ పోలయ్యాయి. పోలు కానీ ఓట్లు ఎన్ని అంటూ లెక్కల్లో మునిగిపోయారు అభ్యర్థులు.దేశంలో అక్కడక్కడా స్థిరపడిన ఓటర్లతో పటు విదేశాల్లో ఉన్న ఓటర్లకు పార్లమెంట్ అభ్యర్థులు గాలం వేసే పనిలో పడ్డారు.విదేశాల్లో ఉన్న వారికోసం వేట ప్రారంభించారు.దేశం మొత్తం మీద ఎన్ని కుటుంబాలు ఉపాధి కోసం వెళ్లాయి. మొత్తం ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది అని లెక్కలు వేస్తున్నారు.స్వదేశీ బాట పట్టిన వారిలో వేలాది మంది ఉన్నారు.దేశం విడిచి వెళ్లినవారు సుమారుగా ఒక్క కేరళ రాష్ట్రంలోనే 90 వేల పైబడి ఉన్నటు సమాచారం.కేరళలో 20 పార్లమెంట్ స్థానాలకు 26న పోలింగ్ జరుగనుంది. ఈ పాటికే చాలామంది ఓటర్లు రాష్ట్రంలోని సొంత ఉరికి చేరుకున్నారు.విమానం టికెట్ బుకింగ్ చేయించుకొని పోలింగ్ సమయానికి చేరుకునే అవకాశం ఉంది. రాష్ట్రము నుంచి ఎవరైతే వెళ్లి ఓటు వేయడానికి వస్తున్నారో వారందరి కోసం సకల సౌకర్యాలు ఏర్పాటుచేస్తున్నారు.