NRI murder : రాను రాను కుటుంబ కలహాలతో హత్యలు పెరిగిపోతున్నాయి. కుటుంబ విలువలు దిగజారడం. మనుషుల్లో పెరుగుతున్న కక్షపూరిత ధోరణితో నూరేళ్ల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇటీవల కుటుంబ కలహాలతో ఒక ఎన్ఆర్ఐ హత్య జరిగింది. దీనికి సంబంధించి వివరాలు..
పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలోని డబుర్జి గ్రామానికి చెందిన సుఖ్ చైన్ సింగ్ కు వివాహం కాగా.. తన భార్య 2022లో సూసైడ్ చేసుకుంది. ఆ తర్వాత ఆయన రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి సుఖ్ చైన్ సింగ్ మొదటి భర్య తల్లిదండ్రులు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు. తన బిడ్డ సూసైడ్ కు కారణమైన ఆమె భర్తను చంపాలని అనుకున్నారు.
ఇటీవల సుఖ్ చైన్ సింగ్ హోటల్, లగ్జరీ కారు కొనుగోలు కోసం ఇండియాకు వచ్చాడు. ఆయన నివాసంలో ఉన్నాడు. ఈ రోజు ఉదయం ఆయన వాకింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు అతని కారుకు సంబంధించి పత్రాలు కావాలని తుపాకీ చూపిస్తూ బెదిరించారు. అతడు ప్రతిఘటించడంతో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. తన తండ్రిని చంపవద్దని పిల్లలు వేడుకున్నా దుండగులు వినిపించుకోలేదు. రెండు రౌండ్ల కాల్పులు జరగడంతో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వేగంగా హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు.
ఈ ఘటనకు సంబంధించి సీసీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారు మాట్లాడుతూ సుఖ్ చైన్ మొదటి భార్య కుటుంబ సభ్యులు అతడిని కాల్చిచంపేందుకు దుండగులను నియమించుకున్నారని డిప్యూటీ పోలీసు కమిషనర్ విశాల్‌జిత్ సింగ్ తెలిపారు. దాడికి ప్రణాళిక రచించి అమలు చేయించిన అతని మొదటి మామ, ఇతర సహచరులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ గొడవ 2022లో సుఖ్ చైన్ సింగ్ మొదటి భార్య ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య న్యాయపోరాటానికి దారితీసింది.