Pawan Kalyan : డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ మొదటిసారి ఇన్ స్టాలో వీడియో పెట్టారు. దీనిపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. నిన్న విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు అనేక మంది తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ఇన్ స్టాగ్రాంలో పోస్టు పెట్టారు. ఆ పోస్టులో పవన్ తన కర్తవ్యాన్ని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వీడియోను షేర్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నందుకు గౌరవంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు తన బాధ్యతలు మరింత పెరిగాయని, నేను నా రాష్ట్రానికి బాధ్యతతో పని చేస్తానని పవన్ కళ్యాణ్ ఆ పోస్టు ద్వారా వెల్లడించారు. బాధ్యతతో పనిచేస్తానని ఆయన రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు.