Aparichitudu : తమిళ్ డైరెక్టర్ శంకర్ చియాన్ విక్రమ్ కాంబోలో వచ్చిన సోషల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అపరిచితుడు’ చూసే ఉంటారు. ప్రజల లెక్కలేని తనం.. పౌరులు, అధికారులు తమ విధులును పాటించకపోవడం మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే వ్యాధి తనలోని అపరిచితుడు వారిని శిక్షించే సీన్లతో చేసిన సినిమా.
ఈ సినిమాలో చియాన్ విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకాశ్ రాజ్ కే చుక్కలు చూపించారట. ఈ పాత్రలో విక్రమ్ తప్ప మరొకరు చేయలేరని ఘంటాపథకంగా చెప్పవచ్చు. ఇప్పటికీ అపరిచితుడు అనే పేరు వినగానే గుర్తచ్చే యాక్టర్ విక్రమే.
ఈ మూవీలో విక్రమ్ కు మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది. అయితే ఈ విషయం తనకు తెలియదు. విక్రమ్ లో ముగ్గురు వ్యక్తులు ఉంటారు. 1. రామం, 2. రెమో, 3. అపరిచితుడు. రామం సాధారణ వ్యక్తి రూల్స్ మాట్లాడుతూ సొసైటీలో బతకాలంటే కొన్ని రూల్స్ పాటించాల్సిందే అని చెప్తుంటాడు. కానీ అపరిచితుడు మాత్రం రామంను ఇబ్బంది పెట్టిన వారిని చంపుకుంటూ వెళ్తాడు. రెమో కేవలం సదా ప్రేమ కోసమే వస్తాడు.
అపరిచితుడు చేసే హత్యలపై పోలీసులు ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా ఆధారాలు మాత్రం దొరికేవి కావు. ఒక సీన్ లో సదాను విక్రమ్ లో వింత ప్రవర్తన చూసి సైకియార్టిస్ట్ వద్దకు తీసుకెళ్తుంది. అక్కడే అసలు విషయం బయటపడుతుంది. తన చెల్లి చిన్నప్పుడు స్కూల్ కు వెళ్లి వస్తుంటే నీటిలో పడిన కరెంట్ వైర్ రోడ్డు మీద నిలిచిన నీటిలో పడి అందులో పడి విక్రమ్ చెల్లి మరణిస్తుంది.
అప్పటి నుంచి విక్రమ్ మానసికంగా బలహీనంగా మారుతాడు. దీనికి కారణమైన లైన్ మెన్ కు కూడా సరైన శిక్ష పడకపోవడంతో తనలో తానే కుంగిపోతాడు. అక్కడి నుంచి ఈ మల్టీఫుల్ పర్సనాలిటీ డిజార్డర్. తర్వాత సైక్రియాటిస్ట్ సాయంతో విక్రమ్ మళ్లీ మామూలు మనిషి అవుతాడు. మూవీ చివరిలో ట్రైన్ లో మందు తాగుతున్న వ్యక్తిని చంపేస్తాడు.
ఈ సినిమా కథలో క్లైమాక్స్ ని గుర్తు చేసుకోండి. విక్రమ్ ఆ వ్యక్తిని ఎందుకు చంపుతాడు? అయితే మీలో సగం మంది ఆన్సర్ తప్పుగా ఊహించి ఉంటారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ (ట్రెయిన్) లో తాగడం తప్పు కాబట్టి అపరిచితుడు మళ్లీ బయటకు వచ్చాడని కానీ ఇది తప్పు.
అసలు కారణం ఏంటంటే విక్రమ్ పాత్ర ఆ వ్యక్తిని ఎందుకు చంపుతుందంటే? తన చెల్లి చనిపోవడానికి గల కారణమైన లైన్ మెన్ అతడే కాబట్టి. మీలో చాలా మందికి ఇది తెలియదు. తెలియని వాళ్లు ఒక్కసారి విక్రమ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్, క్లైమాక్స్ సీన్ రివైండ్ చేయండి. మీకే ఆన్సర్ దొరుకుతుంది.