Value of Vote : నోటు విలువ కాదు.. ఓటు విలువ తెలుసుకో..

Value of Vote

Value of Vote

Value of Vote : ప్రపంచలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 2024లో ఐదేళ్ల పాలనకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది భారతదేశానికి అందులో ఉన్న పార్టీలకు క్రూషియల్ టైం. ఓటుతో ఒక్క సారి సీటు ఎక్కితే చాలు.. ఐదేళ్లు కూర్చోవచ్చు. దేశ, దేశ పౌరుల నుదుట రాత రాయవచ్చు. దీంతో పార్టీలన్నీ తాము ఎలాగైనా గెలవాలని గెలుపు తన పార్టీ సొంతం కావాలని పోటీకి దిగాయి. దేశంకు సంబంధించి సార్వత్రిక (పార్లమెంట్) ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధం అవుతుంటే స్థానిక (అసెంబ్లీ) ఎన్నికలకు కొన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఓటు అనేది కీలకం కానుంది. బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్రం తీసుకున్న తర్వాత జరిగిన ఎన్నికల నుంచి పరిశీలిస్తే రాను రాను ఓటు అమ్ముకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఒక దశలో ఓటుకు రూ. 6వేలు కూడా ఇచ్చిన పార్టీలు ఉన్నాయి. తీసుకున్న ఓటర్లు కూడా కొందరు ఉన్నారు. కానీ రాజకీయ నాయకుడు ఓటుకు  మాత్రం కట్టే విలువ రూ. 500.

పనులకు ఉపయోగించడంతో పాటు మాంసానికి ఉపయోగించే జంతువుల విలువ కూడా దాదాపు రూ. 3వేల నుంచి పైనకే ఉండిపోద్ది కానీ.. మనిషి విలువ, మనిషి వేసే ఓటు విలువ మాత్రం రూ. 500గా నిర్ణయించారు. ఈ రాజకీయ నాయకులు ఈ నేపథ్యంలో నోటు తీసుకొని ఓటు వేయవద్దని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో ఇది ఒకటి. ఈ వీడియోను ఒకసారి చూడండి..

TAGS